‘మ్యాక్స్‌కేర్’లో విజయవంతంగా ఓపెన్ హార్ట్ సర్జరీ

19 Apr, 2015 02:26 IST|Sakshi
‘మ్యాక్స్‌కేర్’లో విజయవంతంగా ఓపెన్ హార్ట్ సర్జరీ

హన్మకొండ చౌరస్తా : వరంగల్ జిల్లాలో మొదటిసారిగా హన్మకొండలోని మ్యాక్స్‌కేర్ ఆస్పత్రిలో ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఓపెన్‌హార్ట్ సర్జరీ విజయవంతంగా నిర్వహించినట్లు హాస్పిటల్ చైర్మన్ కె.కరుణాకర్‌రెడ్డి, మేనేజింగ్ డెరైక్టర్ డాక్టర్ జి.రమేష్ తెలిపారు. ఆస్పత్రిలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సర్జరీ వివరాలను వారు వెల్లడించారు. మ్యాక్స్‌కేర్ ఆస్పత్రిలో ఆరోగ్యశ్రీ పథకం అందుబాటులోకి వచ్చిన మొదటి వారంలో స్టంట్స్‌ను అమర్చామని, అనంతరం రెండు నెలల్లోనే గుండె జబ్బుతో ఆస్ప త్రిలో అడ్మిట్ అయిన ఆదిలాబాద్ జిల్లా సిర్పూర్ కాగజ్‌నగర్‌కు చెందిన మణిమోహన్ చక్రవర్తికి విజయవంతంగా ఓపెన్ హార్ట్ సర్జరీ చేయడం సంతోషంగా ఉందన్నారు.

ప్రముఖ గుండె వ్యాధి నిపుణుడు డాక్టర్ సంతోష్ మంథాని... గుండె వ్యాధిగ్రస్తుడైన చక్రవర్తికి అన్ని రకాల పరీక్షలు చేసి గుండెకు రక్తం సరఫరా చేసే మూడు రక్తనాళాలు మూసుకుని ఉన్నట్లు గుర్తించారని వెల్లడించారు. దీనికి ‘కరోనరీ ఆర్టరీ బైపాస్ సర్జరీ’ అవసరమని నిర్ధారించిన డాక్టర్ సంతోష్ మంథాని హైదరాబాద్ కిమ్స్ హాస్పిటల్ వైద్యుల సహకారంతో ఆపరేషన్‌ను విజయవంతం చేశారన్నారు. హైదరాబాద్ తర్వాత ఉత్తర తెలంగాణ జిల్లాలోని మ్యాక్స్‌కేర్‌లో గుండె శస్త్ర చికిత్సకు అవసరమైన అన్ని సదుపాయాలు, అత్యాధునిక వైద్య పరికరాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.

వైద్యరంగంలో పేద ప్రజలకు మరింత సేవలందించాలని ఆరోగ్యశ్రీ పథకం ద్వారా సర్జరీ నిర్వహించామన్నారు. నాణ్యమైన కార్పొరేట్ వైద్యాన్ని పేదలకందించడమే తమ లక్ష్యమన్నా రు. సమావేశంలో ఆపరేషన్ నిర్వహించిన డాక్టర్లు లక్ష్మీనారాయణ, విజయ్‌కుమార్, అనిల్‌రెడ్డి, మ్యాక్స్‌కేర్ ఆస్పత్రి డెరైక్టర్లు డాక్టర్లు మహేశ్వర్‌రెడ్డి, ప్రవీణ్‌రెడ్డి, కె.రమేష్, రాజీవ్‌రంజన్, సుమన్, టి.మోహన్‌రావు, గుండె వైద్య నిపుణులు డాక్టర్లు వెంకన్న, దినేష్  పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు