ఆపరేషన్ హుస్సేన్‌సాగర్

22 Apr, 2015 05:59 IST|Sakshi
హుస్సేన్ సాగర్ లో తగ్గిపోయిన నీటి మట్టం

హైదరాబాద్ ల్యాండ్ మార్క్ హుస్సేన్‌సాగర్... జంటనగరాలను కలిపే వారధి సాగరే... భాగ్యనగరం పేరు వినగానే చార్మినార్‌తో పాటు గుర్తొచ్చే మరోపేరు హుస్సేన్‌సాగర్..  ఒకవైపు ట్యాంక్‌బండ్‌పై తెలుగువెలుగుల మూర్తులు.. మరోవైపు సాగర్ నడుమ తథాగతుడు.. ఎంత అద్భుత దృశ్యకావ్యమిది. ఇంతటి ప్రశస్తి కలిగిన ఈ సాగర్ తన గర్భంలో ఎన్నెన్నో విషవాయువుల్ని ఇముడ్చుకోవడం మరో విషాదం. ఏళ్ల పూర్వం మంచినీటి సరస్సుగా అలరారిన సాగర్.. ఇప్పుడు మురికికూపంగా మారిపోయింది.

ములు మూసుకుపోయినా పట్టించుకునే నాథుడే లేకుండాపోయాడు. నిజాం హయాం నాటి నిర్వహణ నేడు లేదనేందుకు ఇదో నిదర్శనంగా మిగిలింది. గతం గతః అంటూ ఎట్టకేలకు సాగర్‌కు పునరుజ్జీవం తేవాలని సర్కారు సంకల్పించింది. విషతుల్యమైన ప్రస్తుత జలాల్ని ప్రక్షాళన చేసి.. స్వచ్ఛమైన నీటితో సాగర్‌కు కొత్తకళను తేవాలని భావించింది. ఇందులో భాగంగా అనధికారికంగా సాగర్ ప్రక్షాళన పనులు ప్రారంభమయ్యాయి. అధికారికంగా వెల్లడించకపోయినా ప్రక్షాళన పనులు వేగంగా సాగిపోతున్నాయి.

మరిన్ని వార్తలు