హిజ్రాల ఇంటిపై ప్రత్యర్థుల దాడి

16 Jun, 2014 02:57 IST|Sakshi
హిజ్రాల ఇంటిపై ప్రత్యర్థుల దాడి

- 11 మంది హిజ్రాలకు గాయాలు
- ఎంజీఎం ఆస్పత్రికి తరలింపు
- మిల్స్‌కాలనీ పీఎస్‌లో ఫిర్యాదు
- శాంతినగర్‌లో సంఘటన

కరీమాబాద్ : ఓ వర్గానికి చెందిన హిజ్రాలు మరో వర్గానికి చెందిన హిజ్రాలపై దాడి చేసిన సంఘటన శనివారం అర్ధరాత్రి అండర్ రైల్వేగేటులోని శాంతినగర్‌లో జరిగింది. బాధిత హిజ్రాల నాయకురాలు గౌతమి కథనం ప్రకారం.. శాంతినగర్‌లో ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్న హిజ్రాలపై మరో వర్గానికి(లైలా బ్యాచ్) చెందిన పది మంది హిజ్రాలతోపాటు ఆంధ్రాకు చెందిన హిజ్రాలు సుమారు 30 మంది అర్ధరాత్రి దాడిచేశారు. విచక్షణారహితంగా కొట్టడంతో దీప, సమీర, తపస్య, ఉష, సొనాలీ, పార్వతి, భానుప్రియ, నేహ, నగరం, సితార, సమీర తల, చేతులకు తీవ్రగాయాలయ్యాయి. ఇంట్లోని వస్తువుల న్ని చిందరవందరగా పడేసి, ధ్వంసం చేశా రు.  

బాధితులు మిల్స్‌కాలనీ పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు ఎంజీఎం తరలించి నట్లు చెప్పారు. లైలా హిజ్రాల నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేస్తూ ఇబ్బం దులకు గురిచేస్తుందని గౌతమి ఆరోపించిం ది. దాడి కేసులో పోలీసులకు లైలా దొరకకపోగా కొందరిని స్టేషన్‌కు తరలించారు.  కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ కృష్ణ తెలిపారు. కాగా శనివారం మధ్యాహ్నం రెండు గ్రూపుల మధ్య ఘర్షణ జరిగిందని, ఈ నేపథ్యంలోనే రాత్రి వీరిపై దాడి జరిగినట్లు తెలిసింది.
 
వారి చర్యలు జుగుప్సాకరం : స్థానికులు
ఇదిలా ఉండగా అర్ధరాత్రి కొందరు హిజ్రాలు తమ ప్రత్యర్థులపై దాడిచేసిన తర్వాత బట్టలు విప్పి నడి రోడ్డుమీద హంగామా చేశారని, ఆ దృశ్యాలు జుగుప్సాకరంగా ఉన్నాయని శాంతినగర్ వాసులు తెలిపారు. ఇలాం టివారితో తమ కాలనీ పరువుపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు తగు చర్యలు తీసుకోవాలని వారు కోరారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా