యురేనియం అనుమతులపై నిరసన

9 Apr, 2017 02:24 IST|Sakshi
యురేనియం అనుమతులపై నిరసన

నల్లమలలో శ్రీశైలం–హైదరాబాద్‌ హైవేపై రాస్తారోకో

మన్ననూర్‌(అచ్చంపేట): యురేనియం వెలికి తీసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బహుళ జాతి కంపెనీలకు అనుమతులు ఇవ్వడంపై నాగర్‌కర్నూల్‌ జిల్లా పదర, అమ్రాబాద్‌ మండలాల నల్లమల ప్రజలు ఆందోళనబాట పట్టారు. శనివారం మన్ననూరు వద్ద శ్రీశైలం–హైదరాబాద్‌ ప్రధాన రహదారిపై 3 గంటలపాటు రాస్తారోకో నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ వంశీకృష్ణ, కల్ముల నాసరయ్య, వైస్‌ ఎంపీపీ సంబు శోభ వెంకట రమణ మాట్లాడుతూ యురేనియం తవ్వ కాలతో 100 కిలోమీటర్ల వరకు రేడియేషన్‌ ప్రభావం ఉంటుందని, దీనివల్ల ప్రజలకు ప్రాణాంతకమైన జబ్బులు వచ్చే అవకాశ ముందన్నారు.

సీఎం కూతురు, ఎంపీ కవిత 2009లో నల్లమలను సందర్శించినప్పుడు ఈ ప్రాంత ప్రజలు, ముఖ్యంగా చెంచులకు అం డగా ఉండి డీబీర్స్‌కు అడ్డుకుంటామని చెప్పిన మాటలు నేడు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఒక దశలో పోలీసులకు, ఆందోళనకారులకు  తోపులాట జరిగింది. అమ్రాబాద్‌ సీఐ శ్రీని వాస్, ఎస్‌ఐ జాంగీర్‌ యాదవ్, ఈగలపెంట ఎస్‌ఐ కృష్ణయ్య.. మాజీ ఎమ్మెల్యేతోపాటు పలువురు నాయకులను అరెస్టు చేసి, వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు. కాగా, మండు టెండను సైతం లెక్క చేయకుండా ఆయా గ్రామాల ప్రజలు ఆందోళన చేశారు. ఈ క్రమంలో పోలీసులకు ఆందోళన కారు లకు జరిగిన స్వల్ప ఘర్షణలో తొక్కిసలాట జరిగింది. ఈ క్రమంలో కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు శివాజీతోపాటు మరి కొంతమంది అస్వస్థతకు గురయ్యారు.

మరిన్ని వార్తలు