గప్‌చుప్‌గా ఆన్‌లైన్‌లో..

12 Feb, 2019 02:17 IST|Sakshi

అమెజాన్‌లో పేలుడు పదార్థాల ఆర్డర్‌! 

ఐసిస్‌ అనుమానితుడు ఖదీర్‌పై ఎన్‌ఐఏ చార్జ్‌షీట్‌ 

సాక్షి, హైదరాబాద్‌: నగరానికి చెందిన ఐసిస్‌ సానుభూతిపరుడు, దేశంలో పలు విధ్వం సాల సూత్రధారి ఖదీర్‌పై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) దాఖలు చేసిన చార్జ్‌షీట్‌లో కళ్లు చెదిరే వాస్తవాలు తెలుస్తున్నాయి. ఖదీర్‌ ను ఉగ్రవాద బాటలోకి పట్టించిన అబ్దుల్లా బాసిత్‌ ఆదేశాల మేరకు ఈ కామర్స్‌ సైట్‌ అమెజాన్‌ ద్వారా పేలుడు పదార్థాలను ఇత డు కొనుగోలు చేసినట్లు ఎన్‌ఐఏ చార్జ్‌షీట్‌లో పేర్కొంది. 2016నాటి అబుదాబి మాడ్యూల్‌ కేసులో గతేడాది ఆగస్టులో ఖదీర్, బాసిత్‌లను ఎన్‌ఐఏ అధికారులు అరెస్టు చేశారు. ప్రస్తుతం తీహార్‌ జైల్లో ఉంటోన్న వీరిపై ఎన్‌ఐఏ అధికారులు పాటియాలా కోర్టులో అనుబంధ చార్జ్‌షీట్‌ను దాఖలు చేశారు. 

ఎవరికీ అనుమానం రాకుండా..
విధ్వంసాలకు అవసరమైన పేలుడు పదార్థాల సమీకరణ ఉగ్రవాద సంస్థలకు పెద్ద సవాల్‌గా మారింది. దీంతో ఎవరికీ అనుమానం రాకుండా వీరిద్దరూ సంప్రదాయేతర విధ్వంసక వనరులపై దృష్టి పెట్టా రు. వీటిని కొనుగోలు చేసే బాధ్యతను బాసిత్‌ తన ప్రధాన అనుచరుడు ఖదీర్‌కు అప్పగించాడు. దీనిపై ఇంటర్‌నెట్‌లో అధ్యయనం చేసిన ఖదీర్‌ హైడ్రోజన్‌ పెరాక్సైడ్, ఫాస్ఫరస్, యూరియా తదితరాలను బాంబుల తయారీకి వినియోగించుకోవచ్చని తెలుసుకున్నాడు. పాతబస్తీలోని వివిధ ప్రాంతాలతో పాటు అమెజాన్‌ ద్వారా ఆర్డర్‌ చేసి వీటిని సమీకరిం చాడు. షహీన్‌నగర్‌లోని తన ఇంటితో పాటు తన బం ధువు ఇంట్లోనూ వీటిని ఉపయోగించడంపై కొన్ని ప్రయోగాలు చేశాడు. అయితే వీటిని బాంబు లుగా మార్చడంలో ఖదీర్‌ విఫలమయ్యాడు. ఎన్‌ఐఏ ఇతడిని అరెస్టు చేసినప్పుడు ఇంటి నుంచి ఈ పదార్థాలతో పాటు ల్యాప్‌టాప్‌నూ స్వాధీనం చేసుకున్నా రు. ఈ పదార్థాలు మార్కెట్‌లో తేలిగ్గా దొరకడంతో పాటు ఎవరికీ అనుమానం రాదని వీటిని ఎంపిక చేసుకున్నట్లు వీరిద్దరూ ఎన్‌ఐఏకు తెలిపారు.

బాసిత్‌ ప్రభావంతోనే ఉగ్రబాట
జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాకు చెందిన అనాథాశ్రమం ఉద్యోగి అబ్దుల్‌ ఖుద్దూస్‌ కుమారుడు అబ్దుల్‌ ఖదీర్‌. కొద్దికాలం చంద్రాయణగుట్టలో నివసించిన ఖదీర్‌...బాసిత్‌ ప్రభావంతోనే ఐసిస్‌ వైపు ఆకర్షితుడయ్యాడు. 2015లో పదో తరగతి ఫెయిల్‌ అవ్వడంతో ఓ ఇంటర్నెట్‌ సెంటర్‌లో పార్ట్‌టైమ్‌ ఉద్యోగిగా పని చేశాడు. ఇతడి మేనత్తతో పాటు కొందరు బంధువులు పాకిస్తాన్‌లో ఉంటారు. గతేడాది ఆగస్టు 10న ఓ శుభకార్యం కోసం కుటుంబంతో కలసి ఖదీర్‌ అక్కడకు వెళ్ళాల్సి ఉంది. దానికి మూడ్రోజుల ముందే ఎన్‌ఐఏ విచారణకు హాజరవుతుండటంతో పాక్‌కు వెళ్లడం సాధ్యం కాలేదు. అబుదాబి మాడ్యూల్‌కు సంబంధించిన హ్యాండ్లర్‌తో పాటు ఇతర కీలక కేడర్‌తో ఆన్‌లైన్‌ ద్వారా టచ్‌లో ఉండి, సంప్రదింపులు జరిపింది అబ్దుల్లా బాసిత్‌ అని ఎన్‌ఐఏ చార్జ్‌షీట్‌లో పేర్కొంది.

మరిన్ని వార్తలు