రాష్ట్రపతికి ఆర్డినెన్స్ వ్యతిరేక తీర్మానాలు

20 Jun, 2014 03:42 IST|Sakshi

భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య
 
భద్రాచలం టౌన్: పోలవరం ముంపు విలీన ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా సంబంధిత గ్రామా ల్లో గ్రామ సభ తీర్మానాలు చేయించి రాష్ట్రపతికి పంపనున్నట్టు భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య తెలిపారు. ఆయన గురువా రం ఇక్కడ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... ముంపు మండలాల ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా అఖిల పక్షం తరఫున ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో పోరాటాన్ని విస్తృతం చేస్తున్నట్టు చెప్పారు.
 
అఖిలపక్ష బృందం మరో నాలుగు రోజుల్లో రాష్ట్రపతిని కలిసి, ముంపు మండలాల్లోని ఆదివాసీల గోడును వినిపిస్తుందని.. ఆర్డినెన్స్ ఉపసంహరించాలని విజ్ఞప్తి చేస్తుందని చెప్పా రు. ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద అఖిలపక్షం ఆధ్వర్యంలో ధర్నా జరుగుతుందన్నారు. ముంపు గ్రామాలలోని ‘ఆర్డినెన్స్ వ్యతిరేక గ్రామ కమిటీ’ల ద్వారా ప్రజాభిప్రాయ నివేదికలను ప్రతి రోజు రాష్ట్రపతికు మెయిల్ ద్వారా పంపిస్తామన్నారు.
 
 ఐటీడీఏ పాలక మండలి సమావేశాన్ని భద్రాచలంలోనే నిర్వహించాలి

 ఐటీడీఏ పాలక మండలి సమావేశాన్ని ఈ నెల 21న భద్రాచలంలో కాకుండా ఖమ్మంలో నిర్వహించాలని కలెక్టర్ నిర్ణయించడం సరికాదన్నా రు. ఐటీడీఏ కేంద్రమైన భద్రాచలంలో కాకుం డా ఖమ్మంలో ఎలా నిర్వహిస్తారని ప్రశ్నిం చారు. ముంపు గ్రామాలను గుట్టుచప్పుడు కాకుండా బదలాయించే కుట్రలో భాగంగానే ఈ సమావేశాన్ని ఖమ్మంలో నిర్వహించాలనుకుంటున్నారని విమర్శించారు. ముంపు మం డలాల్లోని విద్యార్థుల బస్ పాసులు చెల్లవంటూ ఆర్టీసీ అధికారులు ఆపేయడం అన్యాయమన్నారు. ముంపు మండలాల్లో అభివృద్ధి పనులు ఆగకుండా కలెక్టర్ చొరవ తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో సీపీఎం నాయకులు ఎజె.రమేష్, రవికుమార్, ఎంబి.నర్సారెడ్డి, శేషావతారం, బ్రహ్మాచారి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు