వినియోగదారుల పాత్ర ఉండాలి: అకున్‌ సబర్వాల్‌

13 Feb, 2019 01:49 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రముఖ వ్యక్తుల ఫొటో లు, పేర్లను వారి అనుమతి లేకుండా చట్ట విరుద్ధంగా ప్రచారానికి వాడుకుంటున్న ఒక రెడీమేడ్‌ షాపుపై ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి.. వినియోగదారుల సలహా కేంద్రానికి ఫిర్యాదు చేసి షాపు యాజమాన్యంపై విజయం సాధించారు. ఫిర్యాదుపై వెంటనే స్పందించిన సలహా కేంద్రం నిర్వాహకులు షాపు యజమానులకు నోటీసులు జారీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఫొటో వాడుకున్నందుకు సలహా కేంద్రం రూ.10 వేల జరిమానా విధించింది.

ఈ జరిమానా మొత్తాన్ని వినియోగదారుల సలహా కేంద్రం బి.ఆకాశ్‌ కుమార్‌కు అందజేసింది. ఈ సందర్భంగా ఆకాశ్‌ను రాష్ట్ర వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి అకున్‌ సబర్వాల్‌ అభినందించారు. ఇటువంటి కేసు మా విభాగానికి రావడం ఇది తొలిసారి అని, ఆకాశ్‌ లాగా ప్రతి ఒక్క వినియోగదారుడు వివిధ రూపాల్లో జరుగుతున్న మోసాలను గుర్తించి ప్రభుత్వానికి తగిన సమాచారం ఇవ్వడంలో తమ వంతు పాత్ర పోషించాలని అన్నారు.   

మరిన్ని వార్తలు