పైలట్‌ను క్షేమంగా వదిలేయండి: ఒవైసీ

27 Feb, 2019 17:39 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పాకిస్తాన్‌ భూభాగంలో కూలిపోయిన మిగ్‌21 విమాన పైలెట్‌ క్షేమంగా తిరిగిరావాలని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఆకాంక్షించారు. ‘‘కష్ట సమయంలో ఈ వీర పైలట్‌కి, అతని కుటుంబం కోసం మేం ప్రార్థన చేస్తున్నాం. జెనీవా ఒప్పందంలోని ఆర్టికల్ 3 ప్రకారం.. బందీలైన ఇతర దేశ సైనికుల పట్ల మానవత్వంతో వ్యవహరించాలి. పాకిస్థాన్ కూడా ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను పక్కన పెట్టి ఐఏఎఫ్ పైలట్ విషయంలో మానవత్వంతో మెలిగి, అతన్ని వదిలేయాలని కోరుతున్నాం’’ అంటూ ఒవైసీ ట్వీట్ చేశారు. (భారత పైలట్‌కు పాక్‌ చిత్రహింసలు!)

బుధవారం భారత వైమానిక దళాలు పాక్‌ దాడులను సమర్థంగా తిప్పికొట్టిన విషయ తెలిసిందే. ఈ క్రమంలో ఐఏఎఫ్‌కి చెందిన ఓ మిగ్21 విమానం కూలిపోయింది. ఈ నేపథ్యంలో మిగ్21ని నడుపుతున్న పైలట్ కనిపించకుండపోయాడని భారత విదేశాంగశాఖ ప్రకటించింది. ప్రస్తుతం పైలెట్‌ తమ దగ్గరే ఉన్నట్లు పాకిస్తాన్‌ ప్రకటించింది. 

మరిన్ని వార్తలు