మన ఊరి అభివృద్ధి మన చేతిలోనే..

18 Jul, 2014 01:45 IST|Sakshi

మందమర్రి రూరల్ : గ్రామాల అభివృద్ధికి ప్ర భుత్వం నడుంబిగించింది. పల్లెల్లో నెలకొన్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి ప్ర భుత్వం కసరత్తు చేస్తోంది. ఇందుకు ప్రత్యేకని ధుల కేటాయింపుకు మన ఊరు-మన ప్రణాళిక కార్యక్రమం చేపట్టింది. గ్రామానికో ప్రత్యేకాధికారిని నియమించి గ్రామాల్లో సభలు ని ర్వహించి సమస్యలపై నివేదిక రూపొందిస్తోం ది. ఇందుకు మండల ప్రత్యేకాధికారులు తహశీల్దార్, ఎంపీడీవోలు, వీఆర్వోలను ప్రత్యేకాధికారులుగా ప్రభుత్వం నియమించింది. గ్రామాల్లో చేపట్టే అభివృద్ధి పనులకు గ్రామసభలో ఆమోదం పొందాకే అధికారులు వాటిని అమలుచేయడానికి నిర్ణయిస్తారు.

 నేటితో పూర్తి..
 మండలంలోని 8 గ్రామపంచాయతీలకు ప్రత్యేకాధికారులను నియమించారు. వీరు 8 గ్రామ పంచాయతీలోని 24 గ్రామాల్లో సర్వేనిర్వహిస్తారు. వీటిద్వారా ప్రణాళికలు సిద్ధం చేస్తారు. విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, పశుపోషణ, భూమిఉపయోగం, ఉపాధి, రోడ్లు, మురికి కాలువలు, విద్యుత్ మరుగుదొడ్లు తదితర అంశాలపై సర్వేలు చేపడుతున్నారు. మార్గదర్శకాల ప్రకారం ప్రణాళికలు రూపొందించిన తర్వాత గ్రామసభను ఏర్పాటు చేసి 18లోగా తీర్మానం చేయాలి.

 సర్పంచులకు పెరిగిన ప్రాధాన్యం..
 ప్రభుత్వ నిర్ణయంతో గ్రామపరిపాలనలో సర్పంచుల ప్రాధాన్యం పెరడగంతో వారిలో ఉత్సాహం వ్యక్తమవుతుంది. ప్రభుత్వ నిర్ణయించిన ప్రకారం నిబంధనలు అమలైతే గ్రామంలో జరిగే ప్రతీపనికి సర్పంచే జవాబుదారిగా ఉంటాడు. గ్రామస్థాయిలో పనిచేసే 25 శాఖలకు పైగా అధికారులంతా సర్పంచ్ మార్గదర్శకాలను అనుసరించే పనిచేయల్సి ఉంటుంది.

మరిన్ని వార్తలు