‘కొండ’కు రింగ్‌రోడ్డు

17 Jul, 2018 13:32 IST|Sakshi
రింగ్‌ రోడ్డు ఏర్పాటుకు కొలతలు తీసుకుంటున్న అధికారులు  

యాదగిరికొండ(ఆలేరు) : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి అంతర్జాతీయ ఖ్యాతి తీసుకురావాలనే ప్రభుత్వం సంకల్పిస్తోంది. మహాదివ్యక్షేత్రంగా రూపుదిద్దుకుంటున్న యాదా ద్రి ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా రోడ్లను సైతం వెడల్పు చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కొండ కింద గల వైకుంఠద్వారం నుంచి కొండ చుట్టూ సుమారు 200 ఫీట్లతో ఔటర్‌ రింగ్‌ రోడ్డును ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.

ఇప్పటికే రోడ్లు, భవనాల శాఖ అధికారులు ఆలయం చుట్టూ నాలుగు లేన్ల రహదారిని నిర్మించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. అందులో భాగంగానే ముందుగా కొలతలు తీసుకున్నారు. çప్రస్తుతం ఉన్న రెండు లేన్ల రోడ్డును యాదగిరిగుట్ట శ్రీరాంనగర్‌ వరకు ఆపివేశారు. త్వరలో ఈ పనులు కూడా ప్రారంభిస్తామని అధి కారులు తెలిపారు.

కొండపైన ప్రధానాలయం పనులు త్వరలో పూర్తి కానున్న సందర్భంగా ఇక ఆలయం చుట్టూ రోడ్డును కూడా అదేవిధంగా అందంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం యోచిస్తోం ది. రింగ్‌ రోడ్డు నిర్మానానికి దేవస్థానం చెక్‌పోస్టు నుంచి సంబంధిత అధికారులు కొలతలు తీసుకుని ప్రభుత్వానికి నివేదిక అందజేయనున్నారు.

మరిన్ని వార్తలు