వైద్య సిబ్బంది సమస్యలు పరిష్కరించాలి

5 May, 2018 07:49 IST|Sakshi
డీఎంహెచ్‌ఓ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్న వైద్య, ఆరోగ్య సిబ్బంది

జనగామ అర్బన్‌ : వైద్య, ఆరోగ్య సిబ్బంది సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ జనగామ జిల్లా కేంద్రంలోని డీఎం హెచ్‌ఓ కార్యాలయం ఎదుట తెలంగాణ వైద్య, ఆరోగ్య సంయుక్త కార్యాచరణ సంఘం (జేఏసీ) ఆధ్వర్యంలో శుక్రవారం  ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు జేఏసీ నాయకులు మాట్లాడుతూ కాంట్రాక్ట్, ఔట్‌ సోర్సింగ్‌ విధానాన్ని రద్దుచేసి వైద్య సిబ్బందిని రెగ్యులర్‌ చేయాలన్నారు. సమాన పనికి సమాన వేతనంతో పాటు సుప్రీం కోర్టు ఉత్తర్వులను అమలు చేయాలన్నారు.

కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు హెల్త్‌కార్డులను ఇవ్వాలని, సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. వైద్యవిధాన పరిషత్‌ ఉద్యోగులకు ఎస్‌టీఓ ట్రెజరీ ద్వారా వేతనాలు చెల్లించాలన్నారు. సమస్యలను పరిష్కరించకుంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని, ఈనెల 8వ తేదీన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం ము ట్టడిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో జేఏసీ కోకన్వీనర్‌ ఏ.విష్ణువర్ధన్‌రెడ్డి, కాంట్రాక్ట్‌ ఎం పీహెచ్‌ఏ (ఎం) అధ్యక్షుడు పేర్వారం ప్రభాకర్, ఐఎన్‌టీయూసీ రాష్ట్ర నాయకులు కేథరిన్, ఉమెన్‌ అసోసియేషన్‌ నాయకులు పూర్ణకుమారి, ఏరియా ఆస్పత్రి అధ్యక్షుడు లక్ష్మయ్య, సెక్రటరీ ప్రవీణ్, సహాదేవ్, సంపత్, శ్రీరాములు, పాండరి, మనోహర్‌ పాల్గొన్నారు. కాగా, సీఐటీయూ జిల్లా కార్యదర్శి బొట్ల శ్రీనివాస్, ఆర్, రాజు, బి. గోపి, ప్రకాష్, ఇర్రి ఆహల్య సంఘీభావం ప్రకటించారు.

మరిన్ని వార్తలు