ఔట్‌ సోర్సింగ్‌ టెండర్లు రద్దు చేయాలి

29 Jun, 2018 14:41 IST|Sakshi
జీఎంకు వినతిపత్రం ఇస్తున్న నాయకులు   

సింగరేణి(కొత్తగూడెం) : సింగరేణిలో ఖాళీగా ఉన్న క్లర్క్‌ పోస్టుల భర్తీకి చేపట్టిన ఔట్‌ సోర్సింగ్‌ టెండర్లను రద్దు చేయాలని ఏఐటీయూసీ అడ్వైజర్‌ దమ్మాలపాటి శేషయ్య డిమాండ్‌ చేశారు. గురువారం ఏరియా జీఎం కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. జీఎం రమణమూర్తికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా శేషయ్య మాట్లాడుతూ క్లరికల్‌ ఖాళీలను అంతర్గత అభ్యర్థులతోనే భర్తీ చేయాలని కోరారు.

గతంలో డైరెక్టర్‌ పా సింగరేణి వ్యాప్తంగా ఉన్న క్లరికల్‌ ఖాళీలను అంతర్గత అభ్యర్థులతో తాత్కలికంగా నియమించి, అనంతరం వారికి పరీక్ష నిర్వహించి ఉత్తీర్ణత పొందిన వారిని శాశ్వత పద్ధతిపై నియమిస్తామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. గుత్తుల సత్యనారాయణ, కేంద్ర ఆర్గనైజింగ్‌ కార్యదర్శి వంగా వెంకట్, బ్రాంచి కార్యదర్శి జి వీరస్వామి, కె రాములు, ఎస్‌ సుధాకర్, మెంగెన్‌ రవి, గట్టయ్య, పి చంద్రయ్య, ఎంవీ రావు, ఎస్‌ శ్రీనివాస్, ఎమ్‌ ఎ నభి,హుమాయిన్, హనీఫ్, బి సత్యనారాయణ, ఆర్‌ సాంభమూర్తి తదితరులు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు