మితిమీరిన వేగం ప్రమాదాలకు కారణం

30 Aug, 2018 12:22 IST|Sakshi

సీటు బెల్టే రక్షణ కవచం

అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం 64 కిలోమీటర్ల వేగమే మేలు

వేగం పెరిగితే ఎయిర్‌ బెలూన్స్‌ కూడా పనిచేయవు

ఎంవీఐ శ్రీనివాసరెడ్డి సూచనలు

నల్లగొండ : ‘మితిమీరిన వేగం ప్రమాదాలకు ప్రధాన కారణం. కారు నడిపే వ్యక్తితో పాటు కారులో ఉన్న అందరూ ఖచ్చితంగా బెల్ట్‌ పెట్టుకోవాలి. అదే ప్రాణానికి రక్షణ కవచం లాంటిది’ అంటున్నారు నల్ల గొండ ఎంవీఐ శ్రీనివాస్‌రెడ్డి. రోడ్డు ప్రమాదంలో సినీ నటుడు హరికృష్ణ మృతిచెందిన నేపథ్యంలో ఆయన బుధవారం పలు విషయాలు వెల్లడించారు. ఆయన మాటల్లోనే..  ‘ఇంటర్నేషనల్‌ సెప్టీ టెస్టింగ్‌’ సంస్థలు నిర్వహించిన సర్వేల ప్రకారం ఏ కారైన 64 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తేనే మంచిది. ఆ సమయంలో ప్రమాదం జరిగినా కారులో రక్షణ కోసం ఉన్న ఎయిర్‌ బ్యాగ్స్‌ పనిచేస్తాయి. ప్రమాదం నుంచి బయటపడవచ్చు.  

అంతకంటే వేగం మించితే వారు వెళ్లే వేగాన్ని బట్టి ఎంత రక్షణ ఉంటుదనేది చెప్పలేని పరిస్థితి. ప్రధానంగా ప్రమాదం అనేది మానవ తప్పిదంగానే ఎక్కువ శాతం ఉంటుంది. ప్రస్తుతం అత్యంత సాంకేతికతతో కూడిన వాహనాలు తయారవుతున్నాయి. కారును స్టార్ట్‌ చేయడానికి కీ పెట్టగానే అన్ని లైట్లు వస్తాయి. ఆన్‌ చేయగానే ఆ లైట్లన్ని పోతాయి. ఒక వేళ లైట్లు కొన్ని వెలుగుతున్నాయంటే అందులో ఏదో ఒక ప్రాబ్లం ఉందని వాహనచోదకుడు తెలుసుకోవాల్సిందే. కానీ చాలా మంది పట్టించుకోకుండా అలానే నడిపి ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నారు. బెల్ట్‌ పెట్టుకోకుంటే శబ్ధం వస్తుంది. అది కొంతదూరం వెళ్లే వరకే వస్తుంది.

కానీ చాలా మంది సీటు బెల్టు పెట్టుకోవడం లేదు. ఇంజన్‌అయిల్‌ మార్చుకోవాల్సిన సమయం వచ్చినా, టైర్‌లో గాలి తక్కువగా ఉన్నా సిగ్నల్స్‌ వస్తాయి. పట్టించుకోవడం లేదు. టైర్ల కంపెనీలు లక్ష కిలోమీటర్ల వరకు మన్నిక ఉంటాయని చెప్పుతున్నాయి. కానీ నడిపే వ్యక్తికి బ్రేక్‌ వేసిన సందర్భంలో టైర్‌ జారీపోతున్నట్లుగా ఉంటే దానిని వెంటనే మార్చుకోవాల్సిందే. సెల్ప్‌ఫోన్‌ మాట్లాడుతూ కారు నడపడం మంచిది కాదు. చోదకుడు ఎప్పుడూ వాహనం ఎంత వేగంలో ఉందో చూసుకుంటూ, ప్రయాణం మీదనే దృష్టి సారిం చాలి. ఏదైనా అవసరమైతే ఆగాలి. తప్ప కారు నడుపుతూ ఫోన్‌ మాట్లాడటం, వాటర్‌ తాగడం లాంటి పనులు చేయడం మంచిది కాదు. ఎన్ని కోట్ల రూపాయల వాహనమైనా నిబంధనల ప్రకారం నడిపితేనే రక్షణ. లేదంటే ప్రమాదాలను కొని తెచ్చుకున్నవాళ్లమే అవుతాము.

సీటు బెల్ట్‌తో ప్రాణానికి రక్షణ

నల్లగొండ క్రైం : సీటు బెల్ట్‌తో ప్రాణానికి లింక్‌ ఉంది. కారులో సీటు బెల్ట్‌ ధరించి వాహనాన్ని నడిపే వారంతా సురక్షితంగా గమ్యానికి చేరుకుంటున్నారు. ఎంతటి ప్రమాదం జరిగినా సీటు బెల్ట్‌ ఉంటే ప్రాణాపాయం నుంచి బయటపడతారని నల్లగొండ టూటౌన్‌ సీఐ భాష తెలిపారు. హరికృష్ణ సీటు బెల్ట్‌ ధరించకపోవడం వల్ల ప్రాణాలు కోల్పోయాడని స్పష్టం చేశారు. 

  •     సీటుబెల్ట్‌ ధరిస్తే ఎంతటి రోడ్డు ప్రమాదమైన  ప్రాణాలు సురక్షితం. 
  •     వాహన మోడల్‌ను బట్టి కొన్ని కిలోమీటర్ల వేగం వరకే హెయిర్‌ బెల్లూన్స్‌ ఓపెన్‌ అవుతాయి. 
  •     సీటుబెల్ట్‌ పెట్టుకుంటేనే బెల్లూన్స్‌ ఓపెన్‌ అవుతాయి.
  •     సీటు బెల్ట్‌ వల్ల గుండె, ఊపిరితిత్తులు, చాతి ఎముకలకు, తలకు గాయాలు కావు.
  •     స్టీరింగ్‌ తగలకపోగా, కుడి, ఎడమ వైపు కూడా గాయాలు కావు.
  •     బలంగా ఇసుకలారీ వేగంగా గుద్దితే సీటు బెల్ట్‌ పెట్టుకున్నా ప్రయోజనం ఉండదు.
  •     గత అనేక సంఘటనల్లో 95 శాతం సీటు బెల్ట్‌ పెట్టుకున్న వారు ప్రమాదాల నుంచి బయటపడ్డారు. 
  •     వాహనం నడిపేటప్పుడు బెల్ట్‌ పెట్టుకోకపోతే చిన్న ప్రమాదమైనా తల, స్టీరింగ్‌కు తగిలి మృతి చెందుతారు.
  •     వాహనం నడిపేటప్పుడు ప్రతిఒక్కరూ సీటు బెల్ట్‌ పెట్టుకునేలా అలవాటు చేసుకోవాలి.
  •     వాహనం నడిపేటప్పుడు ముందుచూపు, పరిమిత వేగం మాత్రమే ఉండాలి.
  •     ఇక్కడి రహదారులలో 80 నుంచి 90 కిలోమీటర్ల లోపు వేగమే సురక్షితం.  
మరిన్ని వార్తలు