అథ్లెటిక్స్ ఓవరాల్ చాంపియన్

10 Nov, 2014 04:07 IST|Sakshi
అథ్లెటిక్స్ ఓవరాల్ చాంపియన్

వరంగల్‌హన్మకొండ చౌరస్తా :జిల్లాను స్పోర్ట్స్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ అన్నారు. హన్మకొండలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో రెండు రోజుల పాటు జరిగిన రాష్ట్రస్థాయి జూనియర్ అథ్లెటిక్స్ పోటీలు ఆదివారం ముగిశాయి. అథ్లెటిక్స్ ఓవరాల్ చాంపియన్‌షిప్‌ను వరంగల్ జట్టు కైవసం చేసుకుంది.

ఈ సందర్భంగా నిర్వహించిన ముగింపు సభకు ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్ విజేతలకు ట్రోఫీలు అందజేసి మాట్లాడారు. సీఎం కేసీఆర్ క్రీడాభివృద్ధి, క్రీడాకారుల సంక్షేమం కోసం ప్రత్యేక నిధులను కేటాయించినట్టు చెప్పారు. జాతీయస్థాయికి ఎదిగిన క్రీడాకారులను ఆదర్శంగా తీసుకుని యువ క్రీడాకారులు ఉన్నత స్థానాలకు ఎదగాలని సూచించారు. కార్యక్రమంలో అథ్లెటిక్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎర్రబెల్లి వరద రాజేశ్వర్‌రావు, జాతీయ కోచ్ నాగపురి రమేష్, అసోసియేషన్ బాధ్యుడు సారంగపాణి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అసోసియేషన్ పక్షాన ఎమ్మెల్యే, కోచ్‌లను శాలువాతో సత్కరించారు.

బెస్ట్ అథ్లెటిక్స్ : బాలురు
ఓవరాల్ బెస్ట్ అథ్లెటిక్స్ గా అండర్-14 విభాగరంలో అరవింద్(మహబూబ్‌నగర్), అండర్-16లో ఈశ్వర్‌దత్‌మెయితా(హైదరాబాద్), అండర్-18లో సుధాకర్(ఖమ్మం), అండర్-20 విభాగంలో అగస్టీన్ ఏసుదాస్(రంగారెడ్డి) బెస్ట్ అథ్లెటిక్స్‌గా ఎంపికయ్యారు.
 
బాలికలు..
అండర్-14 బాలికల విభాగంలో కవిత(కరీంనగర్), అండర్-16లో నిత్య(హైదరాబాద్), అండర్-18లో సుజాత(ఆదిలాబాద్), అండర్-20 విభాగంలో శ్రీలేఖ(వరంగల్) ఎంపికయ్యారు.
 
వివిధ విభాగాల్లో.. బాలురు
లాంగ్‌జంప్ అండర్-14 బాలుర విభాగంలో పాండునాయక్ (మహబూబ్‌నగర్), డిస్కస్ త్రో లో అండర్-16లో సాహిల్(హైదరాబాద్), హార్డిల్స్  అండర్-18లో కిరణ్‌కుమార్(ఖమ్మం), షాట్‌పుట్ అండర్-20 విభాగంలో అంకిత్‌కుమార్(హైదరాబాద్), 1500 మీటర్ల పరుగుపందెం అండర్-20 విభాగంలోకృష్ణయ్య (మహబూబ్‌నగర్) ఎంపికయ్యారు.
 
బాలికలు..
బాలికల విభాగంలో డిస్కస్ త్రో అండర్-16లో సాయిప్రియాంక(కరీంనగర్), 200 మీటర్ల పరుగుపందెం అండర్-18లో విశాలాక్షి (రంగారెడ్డి), 1500 మీటర్ల రన్నింగ్ అండర్-20 విభాగంలో వి.నవ్య(నల్లగొండ) బెస్ట్ అథ్లెటిక్స్‌గా ఎంపికయ్యారు. వీరికి స్పోర్ట్స్ హాస్టల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వెయ్యి రూపాయల చొప్పున ప్రోత్సాహక బహుమతి అందజేశారు.

మరిన్ని వార్తలు