ప్రభుత్వ భూమిలో రాత్రికి రాత్రే.. విగ్రహ ప్రతిష్ఠ..!

20 Nov, 2019 09:08 IST|Sakshi
రాయిని ప్రతిష్ఠించిన స్థలాన్ని పరిశీలిస్తున్న సీఐ రాజశేఖర్‌ తదితరులు

రాయిని ప్రతిష్ఠించి పూజలు చేసిన గుర్తుతెలియని వ్యక్తులు

సాక్షి, ధారూరు: రాత్రికి రాత్రే ప్రభుత్వ భూమిలో గుర్తుతెలియని వ్యక్తులు గుడిసెను ఏర్పాటు చేసి అందులో రాయిని ప్రతిష్ఠించి పూజలు చేసిన సంఘటన ధారూరు మండల కేంద్రంలో చోటుచేసుకుంది. పోలీసులు, రెవెన్యూ అధికారులు తెలిపి వివరాల ప్రకారం.. ధారూరు మండల కేంద్రంలోని ఉర్దూ మీడియం పాఠశాల పక్కన గల ప్రభుత్వ భూమిలో సోమవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు గుడిసె వేసి పైన ఓ జెండాను ఏర్పాటు చేసి దేవాలయంగా మార్చారు. అందు లో రాయిని ప్రతిష్ఠించి పూజలు చేసి వెళ్లిపోయారు. ఉదయాన్నే గుడిసె దేవాలయాన్ని చూ సి ఆశ్చర్యానికి గురైన స్థానికులు, ఉర్ధూ మీడియం పాఠశాల సిబ్బంది విషయాన్ని పోలీ సులు, రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న వెంటనే ధారూరు సర్కిల్‌ సీఐ రాజశేఖర్, ఎస్‌ఐ స్నేహవర్షతో పాటు రెవెన్యూ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని సర్పంచ్‌ చంద్రమౌళిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం వీఆర్‌ఓ గోపాల్‌ పంచనామా నిర్వహించి పోలీసులకు వివరాలు అందజేయగా ఆకతాయి వ్యక్తులు చేసిన పనిగా నిర్ధారించుకొని అందరి సమక్షంలో గుడిసెను, అందులోని రాయిని తొలగించారు.

మరిన్ని వార్తలు