ముస్లిం సంప్రదాయాలకు అడ్డుతగలొద్దు

25 Jan, 2018 19:25 IST|Sakshi

ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ ధ్వజం

తాండూరులో భారీ బహిరంగ సభ

తాండూరు: ముస్లిం మత ఆచారాలపై ప్రభుత్వాలు, కోర్టులు కల్పించుకుంటే సహించేది లేదని ఆవర్గం నేతలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. త్రిబుల్‌ తలాక్‌పై వెలువడిన కోర్టు తీర్పును నిరసిస్తూ బుధవారం రాత్రి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ముస్లిం పర్సనల్‌ లాబోర్డు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సభలో  ఎంఐఎం  అధినేత, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ మాట్లాడుతూ.. బీజేపీ ప్రభు త్వం, ఆర్‌ఎస్‌ఎస్‌ ముస్లింలపై తప్పు డు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. మహిళలకు తమ మతంలో ఇచ్చే గౌరవం.. మరే మతంలోనూ లభించదని తెలిపారు.   

పలువురు మత పెద్దలు మాట్లాడుతూ.. తాండూరులో 30 వేల మంది ముస్లిం మైనార్టీ విద్యార్థులు ఉంటే ఇందులో 3 వేల మంది మాత్రమే తమ మతానికి చెందిన పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్నారని అసంతృప్తి వ్యక్తంచేశారు. ఇత ర పాఠశాలల్లో చేరిన తమ పిల్లలకు మతాచారానికి విరుద్ధంగా వందేమాతరం, సరస్వతీ శ్లోకాలను పఠనం చేస్తున్నారని మండిపడ్డారు. తమ పిల్లలకు ముస్లిం మతాచారం ప్రకారం విద్యావకాశాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు. ప్రస్తుతం దేశంలో ముస్లింల మనుగడ కష్టంగా మారిం దని ఆవేదన వ్యక్తంచేశారు. పదివేల మందికి పైగా సభకు తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో ముస్లిం నేతలు అబుల్‌ రవూఫ్, జుబేర్‌లాల, ఖలీల్‌ పాష, జాఫర్‌ పాష, ముర్తుజా, కమల్‌ అత్తార్, సాధిక్, అహద్, ఖాజాపాష, జావేద్, జియావొద్దీన్‌ ఉన్నారు.  
 

మరిన్ని వార్తలు