కెన్నెడీకి కలామ్‌ ప్రొఫెషనల్‌ ఎక్సలెన్స్‌ పురస్కారం

25 Jun, 2019 20:26 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : డాక్టర్‌ ఏపీజే అబ్దుల్‌ కలామ్‌ ప్రొఫెషనల్‌ ఎక్సలెన్స్‌ పురస్కారం 2019వ సంవత్సరానికి గాను హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం అసోసియేట్‌ ప్రోఫెసర్‌ డాక్టర్‌ పి కెన్నెడీ అందుకున్నారు. మాస్‌ మీడియా అండ్‌ కమ్యూనికేషన్‌ విభాగంలో ఆయనను ఈ పురస్కారం వరించింది. డాక్టర్‌ అబ్దుల్‌ కలామ్‌ రిసెర్చ్‌ సెంటర్‌ బోర్డ్‌ ఆఫ్‌ ట్రస్టీస్‌ కెన్నెడీకి ఈ అవార్డును అందజేశారు. ప్రస్తుతం హెచ్‌సీయూ మాస్‌ మీడియా అండ్‌ కమ్యూనికేషన్‌ విభాగంలో అసోసియేట్‌ ప్రోఫెసర్‌గా పనిచేస్తున్న కెన్నెడీ.. టెలివిజన్‌ రంగంలో సుమారు 20 ఏళ్ల పాటు పనిచేశారు. 

పలు టీవీ చానల్స్‌ కోసం.. విద్యాసంబంధ కార్యక్రమాలు, రియాలిటీ షోలు, గేమ్‌ షోలకు ఆయన దర్శకత్వం వహించారు. హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం ఎడ్యుకేషనల్‌ మల్టిమీడియా రీసెర్చ్‌ సెంటర్‌లో నిర్మాతగా కూడా సేవలు అందించారు. ఈ క్రమంలోనే యూజీసీ-సీఈసీకి అనేక విద్యారంగ కార్యక్రమాలను, ఇ- లెర్నింగ్‌ ప్రోగ్రాములను నిర్మించిన అనుభవాన్ని కెన్నెడీ దక్కించుకున్నారు. ఈ కార్యక్రమాలు అన్ని భారతదేశంలోని అండర్‌ గ్రాడ్యూయేట్‌ విద్యార్థుల కోసం ఉద్దేశించి రూపొందించబడ్డాయి. ఈ పాఠ్యాంశాల ఆధారిత కార్యక్రమాలు జాతీయ చానల్‌ డీడీ-1తోపాటు, వ్యాస్‌​ చానల్‌లో ప్రసారమవుతున్నాయి. వీటిలో చాలా కార్యక్రమాలు పరిశోధన ప్రతిపాదికన రూపొందించబడినవే కావడం విశేషం.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు