నేటినుంచి పాలిసెట్ కౌన్సెలింగ్

20 May, 2016 01:45 IST|Sakshi

మహబూబ్‌నగర్ విద్యావిభాగం/ వనపర్తిటౌన్: తెలంగాణ ప్రభుత్వ సాం కేతిక విద్యామండలి ఆధ్వర్యంలో నిర్వహించిన పాలిసెట్-2016 ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు శుక్రవా రం నుంచి 28వ తేదీ వరకు వనపర్తి పాలిటెక్నిక్ కళాశాల ఆడిటోరియంలో కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు కన్వీనర్ రవికాంత్‌రెడ్డి తెలిపారు.  గురువారం ఆయన విలేకరులతో మాట్లాడా రు. కౌన్సెలింగ్‌కు అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ఈనెల 23 నుంచి 30వ తేదీ వరకు వెబ్‌ఆప్షన్లు పెట్టుకోవచ్చన్నారు. ప్రతిరోజూ ఉదయం 9 నుంచి సాయంత్రం ఐదున్నర గంటల వరకు కౌన్సెలింగ్ ఉంటుందని చెప్పారు.


తప్పనిసరి తీసుకురావాల్సినవి
పాలిసెట్ ర్యాంకు కార్డు, హాల్‌టికెట్, టెన్త్ మార్కుల  జాబితా, 4 నుంచి 10వ తరగతికి వరకు స్టడీ సర్టిఫికేట్, నివాస ధ్రువీకరణపత్రం, కుల, ఈ ఏడాది ఆదాయ ధ్రువీకరణపత్రాలు, ఆధార్ కార్డు వెంట తీసుకురావాలని సూచించారు.

 ఫీజు చెల్లింపు ఇలా..
అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాల పరిశీలన సందర్భంగా బీసీ, ఓసీ అభ్యర్థులు రూ. 500 ఫీజు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ. 250 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీలకు, అర్బన్‌లోని బీసీలకు ఆదాయం రూ.2లక్షల లోపు ఆదాయం కలిగి ఉం డాలి. గ్రామీణప్రాంతాల్లోని బీసీలకు రూ.1.50లక్షల ఆదాయం కలిగి ఉండాలి.


 జిల్లాకేంద్రంలో..
జిల్లాలో మహబూబ్‌నగర్, వనపర్తి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో ధ్రువీకరణపత్రాల పరిశీలన కొనసాగుతుందని ప్రిన్సిపాల్ రవీంద్రబాబు తెలిపారు. ఓసీ, బీసీ, ఎస్సీ విద్యార్థులు వనపర్తి, మహబూబ్‌నగర్‌లో ఎక్కడైనా హాజరుకావచ్చన్నారు. ఎస్టీ విద్యార్థులు మాత్రం జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో జరిగే కౌన్సెలింగ్‌కు హాజరుకావాలని కోరారు.

ఈనెల 23 నుంచి 30 వరకు ఆప్షన్ల నమోదుకు చేసుకునేందుకు అవకాశం కల్పించినట్లు తెలిపారు. శుక్రవారం జరిగే ధ్రువీకరణపత్రాల పరిశీలనకు ఉదయం 9గంటలకు 1 నుంచి 7000 ర్యాంకు, 1.30గంటలకు 7001 నుంచి 14000 ర్యాంకు వరకు అభ్యర్థులు హాజరుకావాలని సూచించారు.

>
మరిన్ని వార్తలు