16 సీట్లు గెలిచి టీఆర్‌ఎస్‌ సత్తా చాటాలి 

10 Apr, 2019 12:17 IST|Sakshi
మాట్లాడుతున్న పల్లా రాజేశ్వర్‌రెడ్డి   

టీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లా రాజేశ్వర్‌రెడ్డి

సాక్షి, ఖమ్మం వైరారోడ్‌: రాష్ట్రంలో 16 మంది టీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థులను గెలిపించి పార్టీ సత్తా మరోసారి చాటాలని టీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లా రాజేశ్వర్‌రెడ్డి పిలుపునిచ్చారు. టీఆర్‌ఎస్‌ కార్మిక విభాగం ఆధ్వర్యంలో ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు గెలుపును కాంక్షిస్తూ మంగళవారం నగరంలోని ఓ హోటల్లో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. కారు గుర్తుపై ఓటు వేసి నామా నాగేశ్వరరావును గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి కార్మికుడిపై ఉందన్నారు.

గత 60 ఏళ్లలో కాని అభివృద్ధి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఐదు సంవత్సరాల్లో చేసి చూపించారన్నారు. అత్య«ధిక ఎంపీ సీట్లు సాధిస్తే కేంద్రం మెడలు వంచి రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేసుకోవచ్చన్నారు. టీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ తనను గెలిపించడం ద్వారా తెలంగాణ బిడ్డగా ఈ ప్రాంత అభివృద్ధికి కృషిచేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్, రాష్ట్ర కార్యదర్శి తాతా మధు, కార్మిక విభాగం అధ్యక్షుడు కాసాని నాగేశ్వరరావు, బిక్కసాని నాగేశ్వరరావు, కూరపాటి రంగరాజు, ఖాజామియా, బి.కరుణ, పాల్వంచ కృష్ణ, జలగం రామకృష్ణ, మన్మథరావు, డోకుపర్తి సుబ్బారావు, మద్దెల రవి తదితరులు పాల్గొన్నారు. 
 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

వేలూరు లోక్‌సభకు ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

కుటుంబ కథా చిత్రం!

ఒక్కో ఓటుపై రూ.700

అలా అయితే ఫలితాలు మరోలా ఉండేవి: పవన్

రాజ్‌నాథ్‌ రాజీనామాకు సిద్ధపడ్డారా?

రెండు చోట్ల అందుకే ఓడిపోయా: పవన్‌

గడ్కరీ ఓడిపోతాడు.. ఆడియో క్లిప్‌ వైరల్‌!

సీఎంతో విభేదాలు.. కేబినెట్‌ భేటీకి డుమ్మా!

నిస్సిగ్గుగా, నిర్లజ్జగా కొంటున్నారు

మాయ, అఖిలేష్‌ల ఫెయిల్యూర్‌ స్టోరీ

అంతా మీ వల్లే

బాబు వైఎస్సార్‌సీపీలోకి వెళితే నేను..

కేశినేని నాని కినుక వెనుక..

కొన్నిసార్లు అంతే.. !!

ఎంపీ కేశినేని నానితో గల్లా భేటీ

‘మాతో పెట్టుకుంటే పతనం తప్పదు’

టీడీపీకి ఎంపీ కేశినేని నాని షాక్‌!

చీఫ్‌ విప్‌గా మార్గాని భరత్‌ రామ్‌

‘మహాఘఠ్‌ బంధన్‌’ చీలిపోయింది...

గిరిరాజ్‌కు అమిత్‌ షా వార్నింగ్‌

అఖిలేశ్‌ భార్యను కూడా గెలిపించుకోలేకపోయాడు!

యూపీలో కూటమికి బీటలు..?

జగన్‌ పాలనను.. చూస్తున్నారా చంద్రబాబూ?

సంఖ్యే ముఖ్యం... శాతం కాదు

గాంధీజీపై ఐఏఎస్‌ అధికారిణి వివాదాస్పద వ్యాఖ్య

బదులు తీర్చుకున్న నితీశ్‌

నితీశ్‌ కేబినెట్‌లోకి కొత్త మంత్రులు.. బీజేపీకి కౌంటర్‌!

మళ్లీ అదే జోడీ

‘త్రిభాష’పై తమిళ పార్టీల కన్నెర్ర

రక్షణ బాధ్యతల్లో రాజ్‌నాథ్‌