పంచాయతీ ఉప ఎన్నికలు

14 May, 2015 01:56 IST|Sakshi
పంచాయతీ ఉప ఎన్నికలు

 ఇందూరు :  స్థానిక సంస్థల ఉప ఎన్నికలకు తెరలేచింది. గ్రామ పంచాయతీ ఎన్నికలు 2013 జూన్, జూలై నెల లలో జరగగా, ఎంపీటీసీ ఎన్నికలు 2014 ఫిబ్రవరిలో జరిగాయి. అయితే కొన్ని వార్డులు, సర్పంచ్, ఎంపీటీ సీ స్థానాలకు నామినేషన్లు రాకపోవడం, గెలిచినవారి లో కొందరు మరణించడం, రాజీనామా చేయడం, కొందరు పదవులు కోల్పోవడంతో చాలా స్థానాలు ఖాళీ అయ్యాయి. ఈ క్రమంలో జిల్లాలో ఉన్న 63 వా ర్డులు, నాలుగు సర్పంచ్, మూడు ఎంపీటీసీ స్థానాల కు ఉప ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ సిద్ధమైంది. ఇందుకు సంబంధించి ఈ నెల 25న సంబంధిత గ్రామాలలో ఓటర్ల ముసాయిదా జాబితాను తయారు చేసి ప్రదర్శించాలని అధికారులను ఆదేశాలు జారీ చేసింది.

ఈ నేపథ్యంలో 2015 జనవరి ఒకటినాటి అసెంబ్లీ ఓటర్ల జాబితా ఆధారంగా గ్రామాల వారీగా ఓటర్ల జాబితాను తయారు చేసే పని లో వారు నిమగ్నమయ్యారు. జాబితా ప్రదర్శన అ నంతరం ఎన్నికలు నిర్వహించే తేదీ, నామినేషన్ల స్వీకరణ, ఉపసంహరణ తేదీల వివరాలతో మ రొక నోటిఫికేషన్ విడుదల చేస్తామని రాష్ర్ట ఎన్నికల కమిషనర్ వి.నాగిరెడ్డి పేర్కొన్నారు. వార్డు స్థానాలకు బ్యా లట్ పద్ధతిలో, సర్పంచ్, ఎంపీటీసీ స్థానాలకు ఈవీ ఎంల ద్వారా ఎన్నికలు నిర్వహించే యోచనలో ఎన్నికల కమిషన్ ఉందని అధికారులు వెల్లడించారు.
 
 ఎన్నికలు జరిగేది ఈ స్థానాలకే

ఎంపీటీసీ
 యంచ, నవీపేట్ మండలం
 నడిపల్లి-2 ,డిచ్‌పల్లి మండలం
 నందివాడ, తాడ్వాయి మండలం
 సర్పంచ్
 కిష్టాపూర్-జె, బీర్కూరు మండలం
 తాడ్గూర్(బి), మద్నూరు మండలం
 భవానిపేట్, లింగంపేట్ మండలం
 కొల్లూరు, బాన్సువాడ మండలం
 
 

మరిన్ని వార్తలు