పంచాయతీ రికార్డులన్నీ ఇకపై ఆన్‌లైన్‌లోనే..

28 Jan, 2017 00:35 IST|Sakshi
పంచాయతీ రికార్డులన్నీ ఇకపై ఆన్‌లైన్‌లోనే..

పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలపై డీపీవోలతో మంత్రి జూపల్లి సమీక్ష

హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీలను కంప్యూటరీకరించాలని పంచాయ తీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి జూపల్లి కృష్ణా రావు అధికారులను ఆదేశించారు. రాష్ట్ర పంచాయ తీరాజ్, గ్రామీణాభివృద్ధి సంస్థ(టీసీపార్డ్‌)లో శుక్ర వారం అన్ని జిల్లాల పంచాయతీ అధికారులతో సమీక్షించారు. మంత్రి మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీల ఆదాయ, వ్యయాలు, ఆస్తులు, పన్నుల వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపరచేందుకు అవసరమైన చర్యలను  చేపట్టాలని పంచాయతీ రాజ్‌ కమిషనర్‌కు, డీపీవోలకు సూచించారు. 5వేల గ్రామ పంచాయతీల్లో కంప్యూటర్లు ఉన్నాయని, వాటిని పూర్తిస్థాయిలో వినియోగంలోకి తేవాల న్నారు. ప్రతి గ్రామ పంచాయతీ సమగ్ర సమాచా రంతో డేటా బ్యాంక్‌ నిర్వహించాలని సూచించారు.

నిర్మాణాలను త్వరగా పూర్తి చేయండి.
ఉపాధిహామీ కింద మంజూరైన గ్రామ పంచాయతీ, అంగన్‌వాడీ భవన నిర్మాణాలను వేగంగా పూర్తి చేసేలా సర్పంచ్‌లను సమాయత్తం చేయాలని డీపీవోలను మంత్రి ఆదేశించారు. వచ్చే ఏడాది గాంధీ జయంతిలోగా రాష్ట్రాన్ని 100% బహిరంగ మలవిసర్జన లేకుండా మార్చా లని, అన్ని గ్రామాల్లోనూ 100% వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం జరిగేలా కృషిచేయాలని అధికా రులకు మంత్రి దిశానిర్దేశం చేశారు. టీఎస్‌ఐపాస్‌ ద్వారా వచ్చిన దరఖాస్తులను త్వరి తగతిన పరిష్కరించాలని ఆదేశించారు. పంచా యతీ సిబ్బందిని హేతుబద్ధీకరించడంతో పాటుగా ఇతర శాఖలకు డిప్యూటేషన్లనూ నిలిపివేశామని కమిషనర్‌ నీతూ కుమారి ప్రసాద్‌  తెలిపారు. క్లష్టర్‌ గ్రామాల నుంచి సేకరించిన వివరాలను కమిషనరేట్‌కు పంపేలా చర్యలు తీసుకోవాలని డీపీవోలను ఆదేశించారు.

>
మరిన్ని వార్తలు