పంద్రాగస్టు పండుగ కోటలోనే..

9 Aug, 2014 02:49 IST|Sakshi
పంద్రాగస్టు పండుగ కోటలోనే..
  •      నిర్ణయించిన జిల్లా యంత్రాంగం
  •      వేదిక స్థలం పరిశీలించిన అధికారులు
  •      ముస్తాబవుతున్న కోట పరిసరాలు
  • ఖిలావరంగల్ : తెలంగాణ రాష్ట్రం లో తొలిసారి జరుగుతున్న స్వాతం త్య్ర వేడుకలను చారిత్రక కాకతీ యుల రాజధాని వరంగల్ కోటలో నిర్వహించనున్నారు. ఈ మేరకు అధికార యంత్రాంగం నిర్ణయించింది. కోటలో వేడుకల నిర్వహణకు ఏర్పాట్లు మొదలుపెట్టారు. వేడుకలు జరిగే స్థలాన్ని వరంగల్ నగరపాలక సంస్థ కార్మికులు చదును చేస్తున్నారు.

    జిల్లా రెవెన్యూ అధికారి సురేందర్‌కరణ్, వరంగల్ ఆర్‌డీవో వెంకటమాధవరావు,అడిషనల్ ఎస్పీ యాదయ్య, ట్రాఫిక్ ఓస్‌డీ వాసుసేన, డీఎస్పీ రాజమహేంద్రనాయక్ శుక్రవారం ఖిలావరంగల్‌కు వచ్చి వేడుకల స్థలాన్ని పరిశీలించారు. స్వాతంత్య్ర వేడుకలకు ఖుష్‌మహల్ పక్కన ఉన్న ప్రైవేటు స్థలాన్ని పరిశీలించారు. ప్రధాన వేదిక, పరేడ్, ప్రేక్షకులు కుర్చునే స్థలం, శకటాల ప్రదర్శన, రోడ్లు, ట్రాఫిక్ వ్యవస్థ, వీవీఐపీల భధ్రత లాంటి ప్రత్యేక అంశాలను దృష్టిలో పెట్టుకుని కోట పరిసరాలను పరిశీలించారు.

    కేంద్ర పురావస్తుశాఖ సమన్వయకర్తలు కుమరస్వామి, సుబ్బారావులను.. ఖుష్‌మహల్ విస్తీర్ణం, అందుబాటులో ఉన్న స్థలం వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఖుష్‌మహల్ పక్కనే ఉన్న రెండు ఎకరాల ప్రైవేటు స్థలం, మినీ పార్క్ స్థలం రెండూ కలిపితే వేడుకలకు అనువుగా ఉంటుందని భావిస్తున్నట్టు అధికారులు చెప్పారు. ఖుష్‌మహల్ పక్కన పిచ్చిమొక్కలతో నిండి ఉన్న స్థలాన్ని త్వరగా తీర్చిదిద్దాలని డీఆర్‌వో సురేందర్‌కరణ్ వరంగల్ నగరపాలక సంస్థ అధికారులను ఆదేశించారు.

మరిన్ని వార్తలు