‘ఫీల్‌ ద జైలుకు’  పంజాబ్‌ నుంచి అక్కాచెల్లెలు

28 Mar, 2018 12:04 IST|Sakshi
జైలులో మొక్కలకు నీరు పడుతున్న దృశ్యం

సంగారెడ్డి క్రైం: పంజాబ్‌ రాష్ట్రానికి చెందిన ఆయుర్వేదిక్‌ వైద్యురాలు ఉపాసన శర్మ, బ్యాంకు ఉద్యోగి పూనం శర్మ అక్కాచెల్లెళ్లు. సంగారెడ్డిలోని ‘ఫీల్‌ ద జైలు’ గురించి ఆన్‌లైన్‌లో తెలుసుకున్నారు. జైలు సూపరింటెండెంట్‌ సంతోష్‌రాయ్‌ని ఫోన్‌లో సంప్రదించారు. జైలు జీవితాన్ని అనుభవించడానికి తేదీలను ఖరారు చేసుకున్నారు. పంజాబ్‌ నుంచి బయలుదేరిన వారు మంగళవారం సాయంత్రం సంగారెడ్డికి  చేరుకున్నారు.
జైలు మ్యూజియంలో ఒక్కొక్కరు రూ.500 చొప్పున చెల్లించి తమ పేర్లను నమోదు చేసుకున్నారు. వారికి జైలు సిబ్బంది బ్యారక్‌ను కేటాయించి యూనిఫాం, ప్లేట్లను అందజేశారు. ‘ఫీల్‌ ద జైలు’ గురించి వివరించారు. ఆశ్చర్యానికి లోనైనా వారు జైలు జీవితం గడిపేందుకు ముచ్చటపడ్డారు. జైలు జీవితం ఎలా ఉంటుందో తెలుసుకోవాలనే ఇక్కడికి వచ్చినట్లు విలేకరులతో తెలిపారు. ప్రపంచంలోనే ఇలాంటి అవకాశం ఎక్కడా లేదన్నారు. 

మరిన్ని వార్తలు