చిన్నారిని అమ్మేందుకు తల్లిదండ్రుల యత్నం

24 Jul, 2019 10:23 IST|Sakshi
తల్లిదండ్రులకు కౌన్సెలింగ్‌ ఇస్తున్న ఐసీడీఎస్, రెవెన్యూ అధికారులు

అడ్డుకున్న అధికారులు

కన్నవారికి కౌన్సెలింగ్‌

రాజంపేట: మండలంలోని కొండాపూర్‌ గ్రామ పంచాయతీ పరిధిలో గల మూడుమామిండ్ల తండాలో ఓ పాపను విక్రేయించేందుకు ప్రయత్నం చేస్తుండగా అధికారులకు తెలియడంతో హుటాహుటినా తండాకు వెళ్లి పాపను రక్షించిన సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. తండాకు చెందిన ముద్రించ దుర్గమణి, భర్త నరేష్‌కు రెండో కూతురు రెండు నెలల పాపని అమ్ముకునేందుకు ప్రయత్నం చేశారు. దీంతో ఉన్నతాధికారులకు సమాచారం అందించడంతో రంగంలోకి దిగిన మండలస్థాయి అధికారులు తండాకు వెళ్లి పాపను రక్షించి ఐసీడీఎస్‌ అధికారులకు అప్పగించేందుకు ఏర్పాట్లు చేశారు. కాగా మనసు మార్చుకున్న పాప తల్లిదండ్రులు తమ బిడ్డ తమకే కావాలని మేము ఎవరికి విక్రయించబోమని చెప్పారు. దీంతో అధికారులు గ్రామ పెద్దలతో సమావేశం ఏర్పాటు చేసి పాప తల్లిదండ్రులకు కౌన్సెలింగ్‌ నిర్వహించారు. పాపను మరోసారి ఇలాంటి సంఘటన చోటు చేసుకోకుండా తల్లిదండ్రుల నుంచి అధికారులు హామీ పత్రాన్ని రాయించుకున్నారు. ఇక నుంచి పాపకు ఎలాంటి అనారోగ్యం వచ్చిన ఎలాంటి ఇబ్బందులు వచ్చినా మేము బాధ్యుత వహిస్తామని అధికారులకు వారు మనస్ఫూర్తిగా చెప్పడంతో వారికి కౌన్సెలింగ్‌ ఇచ్చిన పాపన తిరిగి తల్లిదండ్రులకు అప్పగించారు. కార్యక్రమంలో ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ శివలక్ష్మి, వీఆర్వో సత్యనారాయణ, పంచాయతీ కార్యదర్శులు, అంగన్‌వాడీ సిబ్బంది, నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.    

>
మరిన్ని వార్తలు