ఆలయాలు రాజకీయ అడ్డాలయ్యాయి..

25 Nov, 2019 03:30 IST|Sakshi

సాక్షి, కొత్తగూడెం: దేశవ్యాప్తంగా అన్ని హిందూ దేవాలయాలు ‘రాజకీయ’ కబంధ హస్తాల నుంచి త్వరలో బయటప డనున్నాయని శ్రీపీఠం వ్యవస్థాపకుడు స్వామి పరిపూర్ణా నంద అన్నారు. ఆదివారం ధర్మజాగరణ సమితి ఆధ్వర్యంలో కొత్తగూడెంలో నిర్వహించిన లక్షదీపోత్సవానికి వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. హిందూ దేవాలయాలు రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలో ఉన్నప్పటికీ రాజ కీయ అడ్డాలుగా మారిపోయాయన్నారు. ఆలయాల్లో ఆధ్యాత్మిక, ధార్మిక చైతన్యం కలిగించే వాతావరణం నెలకొల్పాల్సిన అవస రముందన్నారు. ఆలయాలు హిందువుల సొత్తని.. అవి హిందువులకే ఉపయోగపడా లని పేర్కొన్నారు. దేవాలయాల్లో హిందూ భావజాలం, సంస్కృతి రూపు దిద్దుకునేలా మోదీ ప్రభుత్వం వ్యూహరచన చేసిందని చెప్పారు.

హిందూ దేవాలయాల విషయమై పదేళ్లుగా తాము సుప్రీంకోర్టులో న్యాయపో రాటం చేస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలో ఉన్న దేవాలయాల నిర్వహణ, విధివిధానాల రూపకల్పన తదితర అంశాలపై కేంద్ర ప్రభుత్వం బాధ్యత తీసు కోవాలని నిర్ణయించిందన్నారు. ఇందుకోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తోందన్నారు. దీనిపై ఇప్పటికే బీజేపీ ఎంపీ సత్యపాల్‌సింగ్‌ పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టారని, ప్రస్తుత సమావేశాల్లోనే బిల్లు ఆమోదం పొందే అవకాశం ఉందని అన్నారు.  

మరిన్ని వార్తలు