మూణ్ణాళ్ల ముచ్చటేనా!

2 May, 2015 01:44 IST|Sakshi

కరీంనగర్ : పార్లమెంటరీ కార్యదర్శి పదవి హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్‌కు మూణ్ణాళ్ల ముచ్చటే అయ్యేలా ఉంది. పార్లమెంటరీ కార్యదర్శుల నియూమకాన్ని నిలిపివేయూలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడంతో ఆయన పదవికి దూరమయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయి. తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన సతీశ్‌కుమార్‌కు సహాయమంత్రి హోదాతో ప్రభుత్వం 2014 డిసెంబర్ 29న పార్లమెంటరీ కార్యదర్శిగా నియమించిన విషయం తెలిసిందే. విద్యాశాఖ బాధ్యతలను అప్పగించింది.
 
  పార్లమెంటరీ కార్యదర్శుల నియూమకాలు చెల్లనేరవని, సహాయమంత్రుల హోదా ఇవ్వడం రాజ్యాంగాన్ని అతిక్రమించి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమేనని నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేయడంతో విచారణ చేపట్టిన కోర్టు తెలంగాణ ప్రభుత్వానికి షాక్ ఇచ్చేలా తీర్పునిచ్చింది. ఇకనుంచి ఈ నియూమకాలు, హోదాలు, సౌకర్యాలు విరమించుకోవాలని సూచించింది. దీంతో సతీశ్‌బాబుకు సహాయమంత్రి హోదా మూణ్ణాళ్ల ముచ్చటగానే మిగిలినట్లయింది.
 

మరిన్ని వార్తలు