అత్యవసర సేవలకు పాసుల జారీ

26 Mar, 2020 07:47 IST|Sakshi
మాట్లాడుతున్న సీపీ అంజనీకుమార్‌

సమన్వయం కోసం సీపీ ఆఫీస్‌లో హెల్ప్‌డెస్క్‌

ఈ–మెయిల్, వాట్సాప్‌ ద్వారానే సంప్రదింపులు

నేరుగా ఎవరూ కమిషనరేట్‌కు రావొద్దు

నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌

సాక్షి, సిటీబ్యూరో: లాక్‌డౌన్‌ నేపథ్యంలో సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నట్లు నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ పేర్కొన్నారు. ఇందులో భాగంగా అత్యవసర సేవలు అందించే వ్యక్తులు, వాహనాలకు ప్రత్యేక పాస్‌లు జారీ చేస్తున్నామని అన్నారు. దీనికోసం హెల్ప్‌డెస్క్‌ ఏర్పాటు చేశామని తెలిపారు. బుధవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ పాస్‌ల కోసం ఎవ్వరూ కమిషనరేట్‌కు రావద్దని, హెల్ప్‌డెస్క్‌ను ఈ–మెయిల్‌ లేదా వాట్సాప్‌ ద్వారా సంప్రదించాలని కోరారు. అత్యవసరం అయితేనే ఫోన్‌ చేయాలని సూచించారు. బుధవారం ఒక్కరోజే 900 వాహనాలకు, 750 మంది వ్యక్తులకు పాస్‌లు జారీ చేశామన్నారు. ఐటీ సెక్రటరీ జయేష్‌ రంజన్‌తో కలిసి వర్తక, వాణిజ్య, వ్యాపార, సేవల రంగాలకు చెందిన సంఘాలతో సమావేశం నిర్వహించామని, వారి సూచనలు సలహాలు పరిగణలోకి తీసుకున్నామని కొత్వాల్‌ పేర్కొన్నారు.

హెల్ప్‌డెస్క్‌ ఈ–మెయిల్‌: ( covid19.hyd@gmail.com)
వాట్సాప్‌ నంబర్‌: 94906 16780

ఈ పాస్‌ల కోసం వ్యక్తిగతంగా సంప్రదించకూడదు. ఆయా సంస్థలు, సంఘాలు, యూనియన్ల ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
పాస్‌ల జారీ వీరికే:  నిత్యావసర వస్తువుల్ని ఇళ్లకు సరఫరా చేసే ఈ–కామర్స్‌ వాహనాలు, వ్యక్తులు (వీరు కేవలం నిత్యావసర వస్తువుల్ని మాత్రమే రవాణా చేయాలి. విలాస వస్తువుల్ని చేయకూడదు) కోళ్లు, కోడిగుడ్లు, ఆవులు, గేదెలు రవాణా చేసే వాహనాలుకూరగాయలు తరలించే లారీలుహాస్పిటల్స్‌లోని వివిధ విభాగాల్లో పని చేసే ఉద్యోగులు (గుర్తింపుకార్డులు లేని వారు)వివిధ స్టార్‌ హోటళ్లు, లాడ్జిలలో పనిచేసే ఉద్యోగులకు... (దేశవ్యాప్తంగా రవాణా ఆగిపోవడంతో వివిధ రాష్ట్రాల వారు వాటిలో బస చేస్తున్నందున...)మండీలు, మార్కెట్లలో పని చేసే హమాలీలు, ఇతర ఉద్యోగులు చేపలు, మాంసం, వంటనూనె,పంచదార రవాణా చేసే వాహనాలు కేబుల్‌ టీవీ, ఇంటర్‌నెట్‌ సేవల టెక్నీషియన్లకు (వీరికి ఏరియాల వారీగా ఇస్తారు) రక్తదానం, అంత్యక్రియలు వంటి కీలక సేవల్ని అందించే స్వచ్ఛంద సంస్థల కార్యకర్తలకు ప్రైవేట్‌ వాహనాల్లో సంచరించే విద్యుత్‌ శాఖ ఉద్యోగులకు వాహన పాస్‌లు ఇస్తారుమినరల్‌ వాటర్‌ సరఫరా వాహనాలకూ పాస్‌లు జారీ చేస్తారు

వీరికి పాస్‌లు అవసరం లేదు...
పాలు, పాల పదార్థాల రవాణా వాహనాలు (వీటిలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవి ఉన్నాయి)హాస్పిటల్స్‌లో పని చేసే డాక్టర్లు, ఇతర ఉద్యోగులు, మీడియా రంగానికి చెందిన వారు, సింగరేణి ఉద్యోగులు తమ గుర్తింపుకార్డులు చూపిస్తే చాలుఆస్పత్రుల్లోని రోగుల వద్దకు వెళ్లి వచ్చే సహాయకులకు ఆయా హాస్పిటల్స్‌ జారీ చేసిన సర్టిఫికెట్‌ ఉంటే చాలుఔషధాలను సరఫరా చేసే వాహనాలు ముందు అద్దంపై ఆ విషయం తెలుపుతూ రాస్తే సరిపోతుందిఎల్పీజీ సిలిండర్లు రవాణా చేసే వాహనాలువిద్యుత్, ఫైర్‌ తదితర విభాగాల్లో పని పని చేసే ఉద్యోగులు ఐడీ కార్డు చూపిస్తే చాలుబ్యాంకులు, ఏటీఎం సంబంధిత ఉద్యోగులు నిర్ణీత వేళల్లో మాత్రమే గుర్తింపు కార్డు చూపించి సంచరించవచ్చు (వీరు కార్యాలయం–ఇంటి మధ్య మాత్రమే తిరగాలి), న్యూస్‌పేపర్‌ డిస్ట్రిబ్యూషన్‌ వాహనాలు, వ్యక్తులు ఆ విషయం పేర్కొంటే సరిపోతుంది.

దుర్వినియోగం చేస్తే ఉపేక్షించం...
ఈ పాసులను దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. నిబంధనలకు లోబడి మాత్రమే వీటిని వినియోగించుకోవాలి. అలా కాకుండే వాటిని రద్దు చేయడంతో పాటు భవిష్యత్తులో జారీ చేయం. తీవ్రమైన ఉల్లంఘన అయితే కేసులు నమోదు చేస్తాం. ఈ పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండి సోషల్‌ డిస్టెన్స్‌ పాటించాలి. దుకాణాలు, మార్కెట్స్‌ తదితరాలకు వెళ్లనప్పుడు జాగ్రత్తగా వ్యవహరిచాలి. కోవిడ్‌–19కు సంబంధించిన పుకార్లు వ్యాపింపజేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. సోషల్‌ మీడియా ద్వారా వీటిని ప్రచారం చేసే వారికి ఏడాది జైలు శిక్షకు ఆస్కారం ఉంది.  – అంజనీకుమార్, కొత్వాల్‌ 

>
మరిన్ని వార్తలు