నిలోఫర్‌ ఆస్పత్రి సిబ్బందిపై తీవ్ర ఆరోపణలు

27 Jan, 2018 12:47 IST|Sakshi
హైదరాబాద్‌ నిలోఫర్‌ ఆస్పత్రి

సాక్షి, హైదరాబాద్‌: నగరంలోని ప్రముఖ చిన్నపిల్లల దవాఖాన నిలోఫర్‌ ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్య వైఖరిపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిరుపేద చిన్నారులకు చికిత్స అందించే నిలోఫర్‌ ఆస్పత్రిలో అపరిశుభ్రత రాజ్యమేలుతోందని, మూడురోజులైనా ఆస్పత్రిలోని బెడ్‌షీట్స్‌ మార్చడం లేదని చిన్నారుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

బెడ్‌షీట్లు మార్చకపోవడంతో అస్వస్థతతో చికిత్స పొందుతున్న చిన్నారులకు ఇన్ఫెక్షన్‌ వచ్చే ప్రమాదం ఉందని వారి తల్లిదండ్రులు, బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వార్డుల్లో కనీసం డాక్టర్లు, నర్సులు కూడా అందుబాటులో లేరని వారు తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఈ విషయమై ఆర్‌ఎంవోకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, దీంతో చికిత్స కోసం వచ్చిన చిన్నారులు అనేక అవస్థలు పడుతున్నారంటూ రోగుల బంధువులు ఆందోళనకు దిగారు.

>
మరిన్ని వార్తలు