పట్టాభిరాముడు 

28 Mar, 2018 10:24 IST|Sakshi
మహోత్సవం నిర్వహిస్తున్న పూజారి

ఇల్లందకుంట(హుజూరాబాద్‌): ఇల్లందకుంట కోదండరాముని పట్టాభిషేక మహోత్సవాన్ని ఆలయ పూజారులు శేషం రామాచార్యులు, సీతారామచార్యులు శాస్త్రోక్తంగా ఘనంగా జరిపించారు. ప్రతి ఏటా నిర్వహించే పట్టాభిషేక మహోత్సవాన్ని కటంగూరి రంజన్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆలయ పూజారులు సీతా రాములను పట్టు వస్త్రాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. స్వామివారికి, సీతమ్మ తల్లికి నగలను అలంకరించి మహోత్సవాన్ని వందలాది మంది భక్తులు వీక్షిస్తుండగా జరిపించారు. అన్నదానం నిర్వహించా రు. సీతారాములను పల్లకిలో ఊరేగించారు. ఆలయ నిర్వహణాధికారి రాజ్‌కుమార్, చైర్మన్‌ ఎక్కటి సంజీవరెడ్డి, సర్పంచ్‌ పెద్ది స్వరూపకుమార్, ఎంపీటీసీ రామ్‌స్వరణ్‌రెడ్డి, సీఐ నారాయణ, ధర్మకర్తలు పాల్గొన్నారు. 
హంస వాహన సేవ
ఇల్లందకుంట శ్రీసీతారామ చంద్రస్వామి దేవాలయంలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. సీతారాములను పట్టు వస్త్రాలతో సర్వాంగ సుందరంగా అలంకరించి హంస వాహనంపై డప్పు చప్పుళ్ల మధ్య దేవాలయం చుట్టూ ఊరేగింపు నిర్వహించారు. హనుమాన్‌ స్వాములతోపాటు భక్తులు పల్లకి ఎత్తుకొని రామ నామం జపిస్తూ సేవలో పాల్గొన్నారు. ఆలయ చైర్మన్‌ ఎక్కటి సంజీవరెడ్డి, ధర్మకర్తలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు