కట్టుదిట్టంగా పీడీఎస్ వ్యవస్థ

17 Jun, 2016 02:53 IST|Sakshi

* పౌరసరఫరాల సమీక్షలో ఈటల  
* ‘స్థిరీకరణ’ ద్వారా కందిపప్పు ధరకు కళ్లెం

సాక్షి, హైదరాబాద్: ప్రజా పంపిణీ వ్యవస్థలో భాగంగా సరఫరా చేస్తున్న రేషన్ బియ్యం, ఇతర సరకుల్లో అక్రమాల నివారణకు తీసుకుంటున్న చర్యలను మరింత కట్టుదిట్టం చేయాల్సిందిగా అధికారులను పౌర సరఫరాల మంత్రి ఈటల రాజేందర్ ఆదేశించారు. శాఖ పనితీరును అధికారులతో గురువారం ఆయన సమీక్షించారు.

గ్రామీణ స్థాయిలో గోదాముల రూపురేఖలను మార్చడం, రవాణా వ్యవస్థలో జీపీఎస్ వ్యవస్థను అమల్లోకి తేవడం, సరుకుల అక్రమాలపై పోలీసు శాఖతో సమన్వయం చేసుకోవడం వంటి చర్యలు తీసుకోవాలన్నారు. రేషన్ షాపులు, స్టాక్ పాయింట్ల వద్ద సీసీ కెమెరాల ఏర్పాటుపై చర్చించారు. కంది సరఫరా కన్నా కౌంటర్ల అమ్మకానికే సుముఖం: కందిపప్పును పీడీఎస్ ద్వారా రూ.50కే అందిస్తే బ్లాక్‌మార్కెటింగ్‌కు ఆస్కారం పెరుగుతుందని ఈటల అభిప్రాయపడ్డారు. కాబట్టి ధరల స్థిరీకరణ పథకం ద్వారా ప్రత్యేక కౌంటర్లలో నిర్ణీత ధరకు పప్పును అందుబాటులో ఉంచాలని నిర్ణయించినట్టు తెలిసింది.

>
మరిన్ని వార్తలు