‘పెండెం’కు కన్నీటి వీడ్కోలు   

19 Jul, 2018 14:42 IST|Sakshi
 రామన్నపేట : పెండెం జగదీశ్వర్‌ అంతిమయాత్రలో పాల్గొన్న సాహితీవేత్తలు, గ్రామస్తులు 

రామన్నపేట(నకిరేకల్‌) : బాల కథారచయిత, కా ర్టూనిస్టు పెండెం జగదీశ్వర్‌ అంత్యక్రియలు బుధవారం అతని స్వగ్రామం రామన్నపేట మండలకేంద్రంలో జరిగాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సాహితీవేత్తలు, రాజకీయ నాయకులు, ఉపాధ్యాయులు, బంధుమిత్రులు పెద్దసంఖ్యలో తరలివచ్చి జగదీశ్వర్‌కు కడసారి కన్నీటి వీడ్కోలు పలికారు. మునిపంపుల, కొమ్మాయిగూడెం, చిన్నకాపర్తి ఉన్నత పాఠశాలల్లో విద్యార్థులు సంతాప సూచకంగా రెండు నిమిషాలు మౌనం పాటించా రు.

అతని చిత్రపటానికి పూలమాలలు వేసి నివా ళులు అర్పించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చి న జగదీశ్వర్‌ శిష్యులు గురువుగారితో తమకున్న సాన్నిహిత్యాన్ని చెప్పుకుంటూ కన్నీటి పర్యంతమయ్యారు.  సాహితీవేత్తలు జగదీశ్వర్‌తో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుని బోరున విలపించా రు.

చెరుగని చిరునవ్వుతో అందరినీ ఆప్యాయంగా పలుకరిస్తూ, స్ఫూర్తిదాయకంగా ఉండే జగదీశ్వర్‌ ఆత్మహత్య చేసుకోవడాన్ని జీర్ణించుకోలేకపోయారు. జగదీశ్వర్‌ కుమారుడు వికాష్‌తేజ తం డ్రికి తలకొరివిపెట్టాడు.  రోదిస్తున్న కొడుకును ఆపడం ఎవరితరం కాలేదు. 

రాజకీయ, సాహితీవేత్తల నివాళులు

జగదీశ్వర్‌ భౌతికకాయాన్ని పలువురు రాజకీయ నాయకులు సాహితీవేత్తలు, ఉపాధ్యాయ సంఘా ల నాయకులు సందర్శించారు. మృతదేహంపై పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులు అర్పించారు. కు టుంబ సభ్యులను పరామర్శించారు. వారిని ఓదార్చే ప్రయత్నం చేశారు.

నివాళులర్పించిన వారిలో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ పాల్వాయి రజనీకుమారి, కాంగ్రెస్‌ నాయకుడు నలగాటి ప్రసన్నరాజ్, జనవిజ్ఞానవేదిక రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు ఆదినారాయణ, ఎన్‌. వెంకటరమణారెడ్డి, స్వాతం త్య్ర సమరయోధుల సంఘం జిల్లా అధ్యక్షుడు వేమవరం మనోహర్‌పంతులు, మధురకవి డాక్టర్‌ కూరెల్ల విఠలాచార్య, జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు పోరెడ్డి రంగయ్య, నేషనల్‌ బుక్‌ హౌస్‌ సహసంపాదకుడు పత్తిపాక మోహన్, సాహితీ మి త్రమండలి అధ్యక్షుడు తండు క్రిష్ణకౌండిన్య, కార్యదర్శి బాసరాజు యాదగిరి, నకిరేకంటి మొగుల య్య, వెంకటేశ్వరాచారి, జెల్ల వెంకటేశం, వనం చం ద్రశేఖర్,  రాజశేఖర్, రాములమ్మ, రాపోలు శివరంజని, నర్సింహ, ఏబూషి నర్సింహ, ఆనం ద్,  నర్సింహ,  రమేష్, సిలువేరు అనిల్‌కుమార్, కోట విజయవెంకన్న తదితరులు ఉన్నారు.

మరిన్ని వార్తలు