ఆస్పత్రులకు క్యూ

3 Apr, 2020 02:32 IST|Sakshi

జలుబు, జ్వరాలతో ప్రభుత్వాస్పత్రులకు పరుగులు

‘గాంధీ’లో ఒక్కరోజే 500 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు

ఏదో ఒక కాంటాక్ట్‌ ఉంటేనే టెస్ట్‌ల నిర్వహణ

మర్కజ్‌కు వెళ్లిన వారికీ క్వారంటైన్‌ ముద్ర

తమకు రక్షణ లేదంటూ జూడాల నిరసన  

సాక్షి, హైదరాబాద్‌: కరోనా భయంతో జ్వరం, జలుబు, దగ్గు లక్షణాలున్న రోగులు ప్రభుత్వాస్పత్రులకు పరు గెడుతున్నారు. ఢిల్లీ వెళ్లొచ్చిన వ్యక్తులతోపాటు వారి కుటుంబ సభ్యులు, స్నేహితులు, వారితో కాంటాక్టు కలిగి ఉన్నవారు హైదరాబాద్‌లోని గాంధీ, ఉస్మానియా, ఫీవర్‌ ఆస్పత్రులు, వరంగల్‌లోని ఎంజీఎంకు పోటెత్తుతున్నారు. హైదరాబాద్‌లోని ఆసుపత్రులకు కరోనా భయంతో దాదాపు 800 మంది రాగా వరంగల్‌ ఎంజీఎంకు వంద మందికిపైగా వచ్చినట్లు చెబు తున్నారు. అయితే వారిలో కరోనా అనుమానిత లక్షణాలున్న వ్యక్తుల శాంపిళ్లనే పరీక్షలకు పంపిం చారు. హైదరాబాద్‌లో గురువారం ఒక్కరోజే దాదాపు 500 మంది స్వాబ్, రక్త నమూనాలను కరోనా నిర్ధారణ పరీక్షలకు పంపించినట్లు వైద్యాధికారులు చెబుతున్నారు. మిగిలినవారి నమూనాలను పంపించడంలేదు. ఇలా ముం దుకు వచ్చి పరీక్షలు చేయించుకోవడం మంచి పరిణామమని వైద్యాధికారులు అంటున్నారు. అన్ని జిల్లాల్లో ఢిల్లీ గ్యాంగ్‌తో టచ్‌ ఉన్న వారంతా ముందుకు రావాలని ప్రభుత్వం సూచిస్తోంది.

మర్కజ్‌కు వెళ్లినవారికీ క్వారంటైన్‌ ముద్ర...
రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి 1,030 మంది మర్కజ్‌కు వెళ్లి వచ్చినట్లు అధికారులు గుర్తించగా వారిలో 130 మంది మినహా మిగిలిన వారిని ఐసోలేషన్‌ కేంద్రాలకు తరలించారు. తీవ్రమైన లక్షణాలున్న వారికి వెంటనే పరీక్షలు నిర్వహిస్తున్నారు. జిల్లాల్లోనూ వారి నమూ నాలను సేకరించి హైదరాబాద్‌కు పంపుతు న్నారు. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో సేకరించిన నమూనాల ఫలితాలు రాగా ఒకట్రెండు రోజుల్లో మిగిలిన జిల్లాలకు సంబంధించి మర్కజ్‌కు వెళ్లిన వారి నమూనాల ఫలితాలు వస్తాయని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే  వారందర్నీ జిల్లాల్లోని క్వారంటైన్‌ కేంద్రాలకు తరలించారు. అలాగే మర్కజ్‌ యాత్రికులు, వారితో సన్నిహితంగా ఉన్న వారికి కూడా క్వారంటైన్‌ ముద్ర వేశారు. ఇప్పటిదాకా విదేశాల నుంచి వచ్చిన వారికి మాత్రమే ఈ ముద్ర వేయగా తాజాగా మర్కజ్‌తో సంబంధం ఉన్న వారందరికీ వేస్తున్నారు. మర్కజ్‌కు వెళ్లిన వారు, వారి కుటుంబ సభ్యులను ఇప్పటికే గుర్తించిన వైద్య ఆరోగ్యశాఖ.. వారిని పరీక్షలకు, క్వారంటైన్‌ కేంద్రాలకు తీసుకు వచ్చింది. ఈ నేపథ్యంలో కొంతమంది స్వచ్ఛందంగా సహకరించి వచ్చారు. మరి కొందరు మొండికేశారు. హైదరాబాద్‌లో కూడా కొంతమంది ఇలాగే సహాయ నిరా కరణ చేయడంతో సంబంధిత ఏరియాలకు చెందిన కొందరు ఎమ్మెల్యేలు రంగంలోకి దిగి, వారిని ఆస్పత్రులకు పంపారు.

ఆస్పత్రులు కిటకిట...
మర్కజ్‌ వెళ్లిన వారిలో ఎక్కువ మంది కరో నా బారిన పడుతుండటంతో మిగిలిన వారి లోనూ భయం పెరిగింది. దాంతో ఒక్క సారిగా గాంధీ ఆస్పత్రికి క్యూ కట్టారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో 603 మంది మర్కజ్‌కు వెళ్లారు. బుధవారం 300 మంది, గురువారం 500 మంది నమూనాలను గాంధీ ఆస్పత్రిలో సేకరించారు. బుధవారం సేకరించిన 300 న మూనాల్లో 30 మందికి పాజిటివ్‌ వచ్చినట్లు ప్రభుత్వం పేర్కొంది. అయితే ఏ జిల్లాకు చెం దినవారు ఎందరనేది సర్కారు ప్రకటించలే దు. మర్కజ్‌ వ్యవహారం వెలుగుచూసిన నేపథ్యంలో హైదరాబాద్‌లో సర్కారీ ఆస్పత్రులు కరోనా అనుమానితులతో నిండిపోతు న్నాయి. సరోజినీదేవి కంటి ఆస్పత్రిలో ఏర్పా టు చేసిన ఐసోలేషన్‌ బెడ్స్‌ ఇప్పటికే నిండి పోయాయి. అక్కడ ప్రస్తుతం 135 మంది ఐ సోలేషన్‌లో ఉన్నారు. గాంధీలోనూ పాజిటివ్‌ కేసులు పెరిగిపోతున్నాయి. ఛాతీ ఆస్పత్రిలో గురువారం 14 పాజిటివ్‌ కేసులు అడ్మిట్‌ అ వ్వగా ఇప్పటికే అక్కడ 8 మంది చికిత్స పొందుతున్నారు. అక్కడ 31 మంది అనుమానితులు ఉన్నారు. కింగ్‌కోఠి ఆస్పత్రిలో 30 మంది రోగులకు చికిత్స చేస్తున్నారు. అక్కడ మొత్తం 350 పడకలు అందుబాటులో ఉన్నాయి.

రక్షణ లేదంటూ జూడాల ఆందోళన...
జూనియర్‌ డాక్టర్లపై కొందరు కరోనా బాధి తులు, వారి కుటుంబాలు దాడి చేయడంతో గాంధీ ఆసుపత్రిలో ఉద్రిక్తత నెలకొంది. దీం తో తమకు ఏమాత్రం రక్షణ లేదని రాష్ట్రవ్యాప్తంగా జూనియర్‌ డాక్టర్లు ఆందోళన వ్యక్తం చేశారు. తమ భద్రతకు ప్రత్యేక రక్షణ దళం ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు