1500@ పురానాఫుల్‌

1 May, 2020 09:57 IST|Sakshi

సాక్షి, సిటీబ్యూరో:బతికుంటే బలుసాకు తినైనా బతకొచ్చు. కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్‌ విధించిన సందర్భంగా ప్రజలు భౌతికదూరం పాటించాలంటూ సీఎం కేసీఆర్‌ సూచించారు. ఆయన మాటలను అందరూ శిరోధార్యంగా భావించాలి. కానీ.. ఇక్కడ కనిపిస్తున్న ఈ ఫొటోలు చూశారుగా. ప్రజలు గుంపులు గుంపులుగా ఉండి ఎంత బాధ్యతారహితంగా ప్రవర్తించారో వీటిని చూస్తే అర్థమవుతోంది! గురువారం పురానాపూల్‌లో ప్రభుత్వం అందించే రూ.1500 కోసం పోస్టాఫీస్‌ ఎదుట లబ్ధిదారులు ఇలా ఇష్టారీతిగా గుంపులుగా క్యూ కట్టారు. పైసల కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టినట్లుగా వ్యవహరించారు. ఒకరినొకరు తోసుకున్నారు. వాదులాటకు దిగారు. పోలీసులు ఎంత చెప్పినా వినిపించుకోలేదు. పరిస్థితి ఇలా ఉంటే నగరంలో కోవిడ్‌ వ్యాప్తి ఎలా కట్టడి అవుతుందో ప్రతిఒక్కరూ ఆలోచించాల్సిన అవసరముంది. 

మరిన్ని వార్తలు