కరోనా వస్తుందేమోనని కోడిగుడ్లు పూడ్చేశారు

24 Apr, 2020 08:56 IST|Sakshi

సాక్షి, ఏటూరు నాగారం : ‍కరోనా అనుమానం ప్రజల్లో భయాందోళనను కలిగిస్తుంది. ఎంతలా అంటే ఒక వ్యక్తికి కరోనా సోకితే అతను వాడిన వస్తువులు దగ్గర నుంచి ఏదైనా సరే కాల్చేయడమో లేక పాతిపెట్టేడమో చేస్తున్నారు. తాజాగా మండల కేంద్రానికి చెందిన కిరాణం షాపు యజమానికి కరోనా పాజిటివ్‌ రాగా.. ఆయన షాపులో నిల్వ ఉన్న కోడిగుడ్లను గురువారం ట్రాక్టర్‌లో తీసుకెళ్లి పాతిపెట్టారు. సదరు వ్యక్తికి 19 రోజుల చికిత్స తర్వాత నెగెటివ్‌ వచ్చినప్పటికీ ఆయన షాపులో నిల్వ ఉన్న గుడ్లు వాడితే ఇబ్బంది అవుతుందనే భావనతో ఉన్నతాధికారుల సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎంపీడీఓ శ్రీనివాస్‌ తెలిపారు. ఈ మేరకు గురువారం రూ.85వేల విలువైన గుడ్లను తీసుకెళ్లి ఊరి బయట పూడ్చివేశామని చెప్పారు. సర్పంచ్‌ ఈసం రామ్మూర్తి, సీఐ నాగబాబు, తహసీల్దార్‌ సర్వర్‌పాషా, డాక్టర్‌ వైశాలి, పంచాయతీ కార్యదర్శి రవి, బిల్‌ కలెక్టర్‌ వెంకయ్య పాల్గొన్నారు. 
(పోలీసు నుంచి మంత్రికి సోకిన కరోనా)

మరిన్ని వార్తలు