మా గ్రామానికి రావద్దు.. కరోనా తేవద్దు

25 Mar, 2020 12:21 IST|Sakshi
రోడ్డుపై రాళ్లు, కట్టెలు అడ్డుగా వేసిన రెంజర్ల గ్రామస్తులు

రహదారుల మూసివేత

కరోనా కట్టడికి గ్రామస్తుల చర్యలు

నిజామాబాద్‌, భీమ్‌గల్‌: కరోనా వైరస్‌ కట్టడికి పలు గ్రామాల ప్రజలు స్వయంగా రంగంలోకి దిగారు. ఈ వైరస్‌ను నివారించేందకుగాను ప్రభుత్వాలు ఇప్పటి కే పలు చర్యలు చేపట్టాయి. ఈ నెల 31 వరకు కర్ఫ్యూను విధించాయి. ప్రజలు దీన్ని ఖాతరు చేయకుండా రోడ్లపైకి వస్తున్నారు. దీంతో మండలంలోని గోన్‌గొప్పుల్, పురాణీపేట్‌ గ్రామా లు తమ గ్రామ సరిహద్దులను మసివేశాయి. గ్రామానికి చేరుకునే రహదారుల వద్ద ముళ్ల కంచెలు, తాళ్లు, కర్రలతో అడ్డుగా వేశారు. తమ గ్రామస్తులు ఎవరూ బయటకు వెళ్లడానికి వీళ్లేదని, బయటి గ్రామస్తులు ఎవరూ తమ గ్రామాలలోకి రాకూడదని వారు హెచ్చరిస్తున్నారు.
మోర్తాడ్‌:: కరోనాను కట్టడి చేయడానికి మంగళవారం ఆయా గ్రామాలు స్వీయ దిగ్బంధనంకు పూనుకున్నాయి. మోర్తాడ్‌ మండలంలోని సుంకెట్, ముప్కాల్‌ మండలంలోని శెట్‌పల్లి, ఏర్గట్ల మండలంలోని తడపాకల్, వేల్పూర్‌ మండలంలోని పచ్చలనడ్కుడ, ఆర్మూర్‌ మండలంలోని అడవి మామిడిపల్లి త దితర గ్రామాలను స్వీయ దిగ్బంధనంలో ఉంచారు.బారికేడ్లు, ట్రాక్టర్లు అడ్డుపెట్టారు. అలాగే బండరాళ్లను అడ్డుపెట్టి తాళ్లతో అడ్డుకట్ట కట్టించారు. 

సుంకెట్‌లో వినూత్న నిర్ణయం
గ్రామాల స్వీయ దిగ్బంధనం కంటే సుంకెట్‌ గ్రామ పంచాయతీ మరో అడుగు ముందుకు వే సింది. గ్రామంలోని అన్ని వీధులను మూసి ఉంచుతు పంచాయతీ ఆధ్వర్యంలో వినూత్న నిర్ణ యం తీసుకున్నారు. ఇప్పటికే ప్రజలు లాక్‌డౌన్‌ పాటిస్తు ఇళ్లకే పరిమితం అవగా అసలు తమ గ్రామస్తులు అత్యవసరం అయితే తప్ప బయట కు వెళ్లడానికి వీలు లేకుండా గ్రామంలోని వీధు లను దిగ్బంధనం చేశారు.  
బాల్కొండ: బాల్కొండ, ముప్కాల్, మెండోరా మండలాల పరిధిలోని గ్రామాల్లో గ్రామ పంచాయతీ, వీడీసీల ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన చ ర్యలు చేపట్టారు. గ్రామాల్లోకి ఇతర గ్రామాల నుంచి ఎవరు రాకుండా ఎవరు వెళ్లకుండా ప్ర ధాన దారులన్ని మూసివేశారు. కొన్ని గ్రామాల్లో కంచెలను ఏర్పాటు చేశారు.
మాక్లూర్‌: మండల కేంద్రంతో పాటు మామిడిపల్లి గ్రామాల్లో కరోనా కట్టడికి గ్రామ సర్పంచ్‌లు, గ్రామస్తులు మంగళవారం రోడ్లను మూసివేశారు. ఈ సందర్భంగా గ్రామాస్తులు మాట్లాడుతూ కరోనా నివారణ కోసం ప్రతిఒక్కరూ కృషి చేయాలన్నారు. కొత్త వ్యక్తులు గ్రామానికి వస్తే సమాచారం ఇవ్వాలన్నారు. గ్రామస్తులు, ఇతర వ్యక్తులు నిబంధనలకు వ్యతిరేకంగా ప్రవర్తిసే రూ. 1000 జరిమానా విధిస్తామాన్నారు. ఈ నెల 31వ వరకు గ్రామానికి ఇతర వాహనాలు రానివ్వమన్నారు.
వేల్పూర్‌: మండలంలోని పచ్చలనడ్కుడ గ్రా మానికి బయటి వ్యక్తులు రాకుండా గ్రామస్తులు మంగళవారం రహదారిని మూసివేశారు. మా గ్రామానికి రావద్దు కరోనా తేవద్దు అంటూ రహ దారిని మూసివేసినచోట ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు.
కమ్మర్‌పల్లి: కరోనా వైరస్‌ను నియంత్రించే చర్యల్లో భాగంగా కమ్మర్‌పల్లి మండలం బషీరాబాద్, కోనసముందర్‌ తదితర గ్రామాల్లో మంగళవారం గ్రామముఖ ద్వారం వద్ద కంచెలను ఏర్పాటు చేశారు. సర్పంచ్‌ల ఆధ్వర్యంలో గ్రామస్తులు రోడ్డుకు అడ్డంగా ట్రాక్టర్, ట్యాంకర్లను అడ్డుగా పెట్టి రహదారిని మూసివేశారు.
పెర్కిట్‌(ఆర్మూర్‌): ఆర్మూర్‌ మండలం రాంపూర్, పిప్రి గ్రామాలకు వెళ్లే దారులను గ్రామస్తులు మంగళవారం మూసివేశారు. వైరస్‌ను అరికట్టే చర్యల్లో భాగంగా దారులను మూసి వేసినట్లు గ్రామస్తులు తెలిపారు. 

మరిన్ని వార్తలు