విద్యుదాఘాతంలో ఒకరి మృతి

22 Dec, 2014 23:32 IST|Sakshi

జహీరాబాద్ : తండాకు విద్యుత్ సరఫరాను పునరుద్ధరించే క్రమంలో విద్యుదాఘాతానికి గురై ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని ఆనెగుంట గ్రామ పంచాయతీ జీడిగడ్డ తండాలో సోమవారం చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. జీడిగడ్డ తండాలో ఇళ్ల కు, వ్యవసాయానికి సంబంధించిన విద్యుత్ బిల్లులు దాదాపు చెల్లించ కపోవడంతో ఆదివారం అధికారులు సరఫరాను నిలిపేశారు. దీంతో తండా అంధకారంలో ఉండిపోయింది.

అయితే ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకున్న తండాకు చెందిన రూప్లా నాయక్ మరో వ్యక్తిని వెంటపెట్టుకుని ఆదివారం రాత్రి ఏడు గంటల ప్రాంతంలో గ్రామ చివరిలో ఉన్న 11 కేవీ విద్యుత్ లైన్ వద్దకు వెళ్లాడు. అప్పటికే తన వెంట తీసుకెళ్లిన విద్యుత్ వైరుకు కొండి అమర్చి 11 కేవీ విద్యుత్ లైన్ వేశాడు. చేతిలో ఉన్న మరో వైరుకు విద్యుత్ సరఫరా విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు.

అటుగా వెళుతున్న వారు సోమవారం ఉదయం రూప్లానాయక్ మృతి చెందిన విషయాన్ని గమనించి తండా ప్రజలకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న బాధిత కుటుంబ సభ్యులు బోరున విలపించారు. సమాచారం అందుకున్న పోలీసులు తండాకు చేరుకుని రాత్రి 11 గంటల ప్రాంతంలో రూప్లానాయక్ మృతదేహాన్ని జహీరాబాద్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

అధికారుల నిర్లక్ష్యమే రూప్లా ప్రాణం తీసింది!
విద్యుత్ అధికారుల నిర ్లక్ష్యం వల్లే రూప్లా నాయక్ మృతి చెందాడని, ఇందుకు బాధ్యత వహిస్తూ సంబంధిత అధికారులు మృతుడి కుటుంబాన్ని ఆదుకోవాలని తండా వాసులు డిమాండ్ చేశారు. లేని పక్షంలో మృతదేహంతో సంబంధిత కార్యాలయం వద్ద ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. సమాచారం అం దుకున్న రూరల్ ఎస్‌ఐ సత్యనారాయణ, ట్రాన్స్‌కో ఏడీఈ తులసీరాం, ఏఈ శ్రీనివాస్‌లు జహీరాబాద్ ప్రభుత్వాస్పత్రి వద్దకు వెళ్లి మృతుడి బంధువులు, గ్రామస్తులతో మాట్లాడారు.

విషయమై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని, ఇందుకు సంబంధించిన నివేదికను కూడా అందజేశామని ఏడీఈ తులసీరాం తెలిపారు. శాఖాపరంగా న్యాయం చేస్తామని పేర్కొన్నారు. మృతుడికి ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమార్తెలున్నారు. అయితే ఇద్దరి కుమార్తెలకు వివాహాల య్యాయి. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసుదర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్‌ఐ సత్యనారాయణ తెలిపారు.
 
బకాయిలు చెల్లించాలని చెబుతూనే ఉన్నాం
డొమెస్టిక్‌కు సంబంధించి తండాలో సుమారు రూ. 1.50 లక్షలు పెండింగ్ ఉన్నాయి. అదేవిధంగా వ్యవసాయానికి సంబంధించి రూ. 70 వేలు బాకీ ఉన్నారు. వారం, పది రోజులుగా బకాయిలు చెల్లించాలని చెబుతానే ఉన్నాం. తండాకు చెందిన పెద్దలు కూడా ఓ తేదీని ఖరారు చేశారు. ఆ తేదీ కూడా దాటి పోయినా కట్టలేదు. దీంతో ఆదివారం విద్యుత్ సరఫరాను నిలిపివేశాం.
- శ్రీనివాస్, రూరల్ విద్యుత్ ఏఈ

మరిన్ని వార్తలు