పోస్టింగ్‌ల కోసం ప్రదక్షిణలు!

26 May, 2014 02:15 IST|Sakshi

సత్తుపల్లి, న్యూస్‌లైన్: తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించనుంది...నూతన ప్రభుత్వమూ అధికారంలోకి రానుంది...ఇక మంచి పోస్టింగ్‌ల కోసం అధికారులు హైదరాబాద్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అధికారపార్టీ నేతలను ప్రసన్నం చేసుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. పలువురు అధికారులు తమకు తెలిసిన టీఆర్‌ఎస్ నేతలను వెంటబెట్టుకొని అగ్రస్థాయి నేతల వద్దకు వెళ్లి తెలంగాణ ఉద్యమం, సకలజనుల సమ్మెలో ఎట్లా పని చేశామో ఏకరువు పెడుతూ తమ బయోడేటాలను  వాళ్ల ముందు ఉంచుతున్నారు.

ఎన్నికల సంఘం నిబంధనలతో జిల్లాలో పనిచేస్తున్న తహశీల్దార్లు, ఎంపీడీఓలు, ఏఓలు ఆదిలాబాద్, వరంగల్, నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాలకు బదిలీపై వెళ్లాల్సి వచ్చింది. కొద్ది రోజుల్లో మళ్లీ జిల్లాకు వచ్చే అవకాశం ఉండటంతో  మంచి పోస్టింగ్‌ల కోసం పైరవీలు ప్రారంభించారు.  ఎవరిని పట్టుకుంటే పని అవుతుందో ఆరాతీస్తూ... తమ పనిని చేయించుకునేందుకు ఎవరి ప్రయత్నాల్లో వారున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా పోలీస్ శాఖలో కూడా బదిలీలు జరగవచ్చని జోరుగా ప్రచారం జరుగుతోంది.

 జూన్ పది తరువాతనే....
 జూన్ 2 అపాయింటెడ్ డే రోజున కేసీఆర్ తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. పరిపాలనపై పూర్తి పట్టు సాధించేందుకు అధికార యంత్రాంగం కూర్పుపై ఆయన దృష్టిసారించే అవకాశం ఉంది. జూన్ 10వ తేదీ నుంచి ఇతర జిల్లాల్లో పని చేసిన అధికారులను సొంత జిల్లాలకు బదిలీపై తిరిగి పంపించే అవకాశం ఉన్నట్టు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.

 దీంతో ఈలోగానే తమతమ పరిచయాలతో మంచి పోస్టింగ్‌లు దక్కించుకునేందుకు అధికారులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. అదే విధంగా ఇక్కడకు బదిలీపై వచ్చిన అధికారులు కూడా ఆయా జిల్లాల్లో కలెక్టర్‌కు రిపోర్టు చేయాల్సి ఉంటుంది. అయితే వారిలో కొందరు అధికారులు ఈ జిల్లాలోనే పని చేసేందుకు తమవంతు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. మొత్తంగా  ప్రభుత్వ కార్యాలయాలలో ఇప్పుడు ఎక్కడ విన్నా బదిలీల మాటే.  ఎవరు ఎక్కడికి ట్రాన్స్‌ఫర్ అవుతారు.. కొత్తవారు ఎవరు పోస్టింగ్ తెచ్చుకుంటారోనని చర్చలు జోరుగా సాగుతున్నాయి.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

గీత దాటిన సబ్‌ జైలర్‌

వడలూరుకు రాము

వైద్యుల ఆందోళన తీవ్రరూపం

ఖాళీ స్థలం విషయంలో వివాదం 

డ్రంకన్‌ డ్రైవ్‌.. రోజుకు రూ.2లక్షల ఫైన్‌

పరిష్కారమే ధ్యేయం! 

అభాగ్యుడిని ఆదుకోరూ !

స్కూటర్‌ ఇంజిన్‌తో గుంటుక యంత్రం

అగమ్యగోచరంగా విద్యావలంటీర్ల పరిస్థితి

‘డెయిరీ’  డబ్బులు కాజేశాడు?

హరితం.. వేగిరం

పిట్టల కోసం స్తంభమెక్కిన పాము

బెల్లంపల్లి గురుకులంలో ఫుడ్‌ పాయిజన్‌

చినజీయర్‌ ఆశీస్సుల కోసం వచ్చా....

'కార్మికుల కష్టాలు నన్ను కదిలించాయి'

ఉపాధ్యాయ వృత్తికే కళంకం

హలో ఎస్‌బీఐ నుంచి మాట్లాడుతున్నా..

ఏమిటా స్పీడు... చలాన్‌ పడుద్ది

అప్పులుంటే అసెంబ్లీ కట్టకూడదా? 

జాతీయ పండుగగా గుర్తించండి

రీపోస్టుమార్టం చేయండి

అభివృద్ధిపై విస్తృత ప్రచారం

మా వైఖరి సరైనదే

ఒక్క రోజు 12 టీఎంసీలు

వివిధ ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు

వచ్చేస్తున్నాయి బ్యాటరీ బస్సులు!

ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల

మేమంటే.. మేమే! 

‘చింతమడక స్కీమ్‌’ అని పెట్టినా ఓకే..కానీ

ఈనాటి ముఖ్యాంశాలు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

కాజల్‌ వద్దనుకుందా?

2019 అబ్బాయి.. 1993 అమ్మాయి!

సైబర్‌ క్రైమ్‌ గురించి చెప్పాం

లాక్‌ చేశారు

నవ్వుకున్నోళ్లకు నవ్వుకున్నంత

డైనమిక్‌ కమ్‌బ్యాక్‌