చెరువులో చేపలు లూటీ చేశారని..

31 May, 2019 12:38 IST|Sakshi
కందిబండ చెరువులో చేపలు పడుతున్న ప్రజలు 

ఆగ్రహించిన చెరువు లీజుదారులు

20 బైక్‌లకు నిప్పంటించిన వైనం

మేళ్లచెరువు  (హుజూర్‌నగర్‌) : సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌ మండలంలోని కంది బండ గ్రామ పరిధిలోని ఊరచెరువులో చేపలు గురువారం లూటీకి గురయ్యాయి. వివరాలు..  మండలంలోని కందిబడం గ్రామం పరిధిలోని ఊరచెరువు స్థానిక మత్స్య సహకార సంఘం ఆధ్వర్యంలో ఉండగా దాన్ని కొంతమంది గ్రామస్తులు రూ.30లక్షల లీజుకు తీసుకుని చేప పిల్లలు పోసి పెంచారు. కాగా రెండురోజులుగా చేపలు పడుతున్నారు. గురువారం కూడా చేపలు పట్టే సమాయానికి మండలంలోని పలు గ్రామాలతో పాటు కోదాడ, హుజూర్‌నగర్, మఠంపల్లి, గరిడేపల్లి మండలాల్లోని వివిధ గ్రామాలకు చెందిన వ్యక్తులు వందల మంది చెరువులోకి దిగి ఇష్టం వచ్చనట్లు చేపలు పట్టుకున్నారు.

దీంతో ఆగ్రహించిన లీజు దారులు చేపలు పట్టె వారికి చెందిన సుమారు 20బైక్‌లకు నిప్పంటించారు. దీంతో బైక్‌లు పూర్తిగా దగ్ధమయ్యాయి. దీంతో హుజూర్‌నగర్‌ ఫైర్‌ స్టేషన్‌ వారు వచ్చి మంటలను ఆదుపులోకి తీసుకొచ్చారు.సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు కాలిపోయిన సుమారు 8 బైక్‌లను స్టేషన్‌కు తరలించారు. కాగా ఈ విషయమై ఎటువంటి ఫిర్యాదు అందలేదన్నారు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని వారు తెలిపారు.


దగ్ధమవుతున్న లూటీదారుల బైక్‌లు

మరిన్ని వార్తలు