హైదరాబాద్‌ నుంచి వచ్చారని ఊరి బయటే..

30 Apr, 2020 08:12 IST|Sakshi

సాక్షి, సిరికొండ(బోథ్‌) : కరోనా వైరస్‌  ప్రపంచవ్యాప్తంగా గడగడలాడిస్తోన్న సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లో ఉంటే కష్టమని సొంతూళ్లకు బయలుదేరినా కరోనా లక్షణాలు ఉన్నాయేమోననే అనుమానంతో ఊరి బయటే ఉంచుతున్నారు. తాజాగా ముగ్గురు వ్యక్తులు హైదరాబాద్‌లో ఎలాగోలా బతికి తిరిగి సొంతూళ్లకు రావడంతో కరోనా భయంతో గ్రామస్తులు ఊరి నుంచి బయటకు వెళ్లగొట్టారు. ఈ ఘటన ఆదిలాబాద్‌ జిల్లా సిరికొండ మండలంలోని రాంపూర్‌గూడలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రాథోడ్‌ రమేశ్, పవార్, రమేశ్‌ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు కంపెనీలో జాబ్‌ చేస్తున్నారు. లాక్‌డౌన్‌తో వీరు ముగ్గురు ఇన్నాళ్లు హైదరాబాద్‌లో ఉన్నారు. ఓ లారీలో మంగళవారం రాత్రి రాగా గ్రామస్తులు ఊరిబయటే ఉంచారు. దీంతో వీరిప్పుడు పంట పొలాల్లో ఉంటున్నారు. 14 రోజుల పాటు ఎలాంటి లక్షణాలు బయటపడకపోతే అప్పుడు వీరిని ఊర్లోకి రానిస్తామని గ్రామస్తులు పేర్కొన్నారు.
(పేద బ్రాహ్మణునికి నిత్యావసరాల పంపిణీ)

మరిన్ని వార్తలు