పరమేశ్వరా...గంగవిడువరా..!

17 Jun, 2014 02:08 IST|Sakshi
పరమేశ్వరా...గంగవిడువరా..!

కొన్ని వందల ఏళ్ల కిందట దేశాటన చేస్తున్న శ్రీనాథమహాకవికి కొన్ని ప్రాంతాల్లో సంధ్యవార్చేందుకు ఉపక్రమిస్తే నీరు కనిపించ లేదట. దీంతో ఆయన ‘తిరుపమెత్తువానికి ఇద్దరు భార్యలెందుకు..పార్వతి చాలున్, గంగన్ విడువుము పరమేశా’ అంటూ ఓ చాటువును చెప్పాడట. దీంతో శివుడు కనికరించి జలాలను అందించాడట. ఇప్పుడు జిల్లాలో విత్తనాలు వేసి వానలు కోసం ఎదురు చూస్తున్న  రైతులకు చినుకులు రాలక కలవర పడుతున్నారు.

ఈ నేపథ్యంలోనే సోమవారం ఆత్మకూర్ చెరువులోని పరమేశ్వర స్వామికి స్థానికులు కృష్ణాజలాలను తెచ్చి అభిషేకించారట. బండెనక బండికట్టి 121 బిందెలతో నీరు తెచ్చి గంగాధరుడిని వర్షాలు కురిపించాలని వేడుకున్నారు. స్థానిక సర్పంచ్ ఎం.గంగాధర్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.  ఉదయం ఎనిమిది గంటలకు ఈ కార్యక్రమం నిర్వహించారు.             
-ఆత్మకూర్
 

మరిన్ని వార్తలు