బహిష్కరణ కలకలం !  

28 Aug, 2018 11:17 IST|Sakshi
నిరసన తెలుపుతున్న మాధవరావు కుటుంబం   

అవమానించారంటూ ఆత్మహత్యాయత్నం చేసిన కుటుంబం

ముత్యాలమ్మకు బోనాల చెల్లింపు వద్ద వివాదం

గ్రామంలో ఉద్రిక్తత.. పోలీస్‌స్టేషన్‌కు చేరిన పంచాయితీ

నేలకొండపల్లి ఖమ్మం : సాంకేతిక పరిజ్ఞానం కొత్త పుంత లు తొక్కుతున్న ఈ రోజుల్లోనూ గ్రామాల్లో సాం ఘిక దురాచారాలు కొనసాగుతున్నాయి. పెత్తం దారీ పోకడలతో చేయని తప్పుకు ఓ కుటుంబాన్ని బహిష్కరిస్తున్నామంటూ కొందరు ‘పెద్దలు’ తీర్పు చెప్పారు. ఈ విషయాన్ని గ్రామం లో టమ కా వేయించారు. దీంతో మనస్తాపానికి గురైన బాధిత కుటుంబసభ్యులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా, వారి బంధువులు అడ్డుకున్నారు. కలకలం రేపిన ఈ ఘటన నేలకొండపల్లి మండలం అమ్మగూడెంలో చోటుచేసుకుంది.

బాధితులు, స్థానికుల కథనం ప్రకారం.. అమ్మగూడెం గ్రామం లో ఆదివారం ముత్యాలమ్మకు బోనాలు చెల్లించా రు. ఈ విషయంలో ఇరువర్గాల మధ్య వివాదం చోటు చేసుకుంది. తమకు తెలియకుండా బోనం ఎలా చెల్లిస్తావంటూ  గండు మాధవరావు కుటుంబంతో అదే సామాజిక వర్గానికి చెందిన కొందరు ఘర్షణకు దిగారు. ఈ వివాదం ముదరకముందే సమాచారం అందుకున్న పోలీసులు ఇరువర్గాలతో చర్చించి శాంతింపజేశారు.  

టమకాతో అవమానం..  

ముత్యాలమ్మ జాతర సందర్భంగా గ్రామ కట్టుబాట్లను ఉల్లంఘించారని, దీంతో మాధవరావు కుటుంబాన్ని సాంఘికంగా బహిష్కరిస్తున్నామంటూ కొందరు పెద్దలు గ్రామంలో సోమవారం ఉదయం టమకా వేయించారు. వారి ఇంటికి ఏడాది పాటు ఎవరూ వెళ్లవద్దని, ఆ ఇంట్లో జరిగే ఏ కార్యక్రమానికీ హాజరు కావద్దని, దీన్ని ఎవరైనా ఉల్లంఘిస్తే జరిమానా విధిస్తామని హెచ్చరించారు.

అయితే రాజకీయ స్వార్థంతో, కక్షపూరితంగా వ్యవహరించి ఇలా చేశారని, తమ వెంట 40 కుటుంబాలు ఉన్నాయని, రాజకీయంగా ఎదుర్కోలేకనే ఇలాంటి చర్యలకు పాల్పడ్డారని మాధవరావు తనయుడు సతీష్‌ ఆవేదన వ్యక్తం చేశాడు. అంతేకాక, ఇది అవమానంగా భావించి.. కుటుంబసభ్యులంతా ఆత్మహత్య చేసుకుంటామంటూ బయటకు వెళ్లడంతో బంధువులు అడ్డుకున్నారు. ఓ కుటుంబంపై ఇలా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం ఏంటని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది దుర్మార్గమైన చర్య అని ఆందోళన వ్యక్తం చేశారు. 

ఏడుగురిపై పోలీసులకు ఫిర్యాదు..  

సాంఘిక బహిష్కరణ విషయంపై బాధితులు గండు మాధవరావు, సతీష్‌ స్థానిక పోలీస్‌స్టేషన్‌లో గ్రామానికి చెందిన ఏడుగుగురిపై ఫిర్యాదు చేశారు. అయితే విచారణ నిర్వహించిన తర్వాత  వాసంశెట్టి సత్యనారాయణ, వి.నర్సయ్య, వి.వేణు, వి.రామారావు అనే నలుగురిపై  కేసు నమోదు చేశామని ఎస్సై సుమన్‌ తెలిపారు.  

స్వార్థంతో బహిష్కరణ వేటు 

ముత్యాలమ్మ జాతర అంతా సాఫీగా జరిగినా రాజకీయంగా ఎదుర్కోలేక మా కుటుంబాన్ని టార్గెట్‌ చేసి బహిష్కరించారు. అడపాల రామారావు, బెల్లం రామారావు  స్వార్థంతోనే మమ్మల్ని అవమానించారు. సమాజంలో మేమెలా బతకాలి.  – గండు సతీష్‌  

న్యాయం చేయకుంటే ఆమరణ నిరాహార దీక్ష 

గ్రామంలో కొంత మంది కావాలనే మా కుటుంబంపై కక్ష కట్టి వెలివేస్తున్నట్లు టమకా వేయించారు. వారందరిపై కేసు నమోదు చేయకపోతే ఆమరణ నిరహార దీక్ష చేస్తాం. మేము ఏం తప్పు చేశామని వెలివేస్తారు. మమ్మల్ని బహిష్కరించిన వారిపై చర్య తీసుకుని మాకు న్యాయం చేయాలి.             – గండు మాధవరావు

మరిన్ని వార్తలు