ఆ.. ఘోరం జరిగింది ఇక్కడేనా!

2 Dec, 2019 11:38 IST|Sakshi

తొండుపల్లి ఘటనా స్థలానికి వస్తున్న ప్రజలు

సాక్షి, శంషాబాద్‌: ‘పాపం.. ఆ అమ్మాయిని ఇక్కడే హత్య చేశారు.. అయ్యో కొంచెం ధైర్యం చేసి రోడ్డుపైకి వస్తే ప్రాణాలు దక్కేవి.. పోలీసులు గస్తీ తిరిగి మృగాలను పసిగట్టినా ఘోరం జరగకపోయేది కదా..’ అని ప్రజలు చర్చించుకుంటున్నారు. శంషాబాద్‌ మండలంలోని తొండుపల్లి టోల్‌గేటు వద్ద జస్టిస్‌ ఫర్‌ దిశ హత్యా సంఘటన ప్రాంతాన్ని సందర్శిస్తున్న జనం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జాతీయ రహదారి, ఔటర్‌ రింగురోడ్డు గుండా రాకపోకలు సాగించేవారితో పాటు స్థానికులు ఇక్కడ ఆగి ఘోర దుర్ఘటనను తలచుకుని కన్నీరు పెడుతున్నారు. ఈ ప్రాంతం వద్ద గుమికూడిన జనం పరిసరాలను పరిశీలించి ఘటనను గుర్తు చేసుకుంటున్నారు. వాహనాల రద్దీ, జన సంచారం ఉన్న ఇలాంటి చోట ఈ ఘటన జరగడం ఏమిటని మదన పడుతున్నా రు. ఎవరి నోట విన్నా.. అయ్యో ఎంత ఘో రం జరిగింది అనే మాట వినిపిస్తోంది. వారిలో ఆవేదన, ఆక్రోషం కనపడుతోంది. అమ్మాయిపై అఘాయిత్యానికి పాల్పడిన మాన వ మృగాలను కాల్చివేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.   

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

తెలంగాణ కరోనా బులిటెన్‌.. 77 మందికి చికిత్స

లాక్‌డౌన్‌: ఎర్రగడ్డకు పోటెత్తిన మందుబాబులు

ఢిల్లీ ప్రార్థనల్లో తెలంగాణ నుంచి 1030 మంది!

లాక్‌డౌన్‌ : మద్యం బ్లాక్‌ దందా..

పోలీస్‌.. సెల్యూట్‌..

సినిమా

భార్య, పిల్లలు విదేశాల్లో చిక్కుకుపోయారు: విష్ణు

ఈ పాటను చేతులు కడుక్కొని వినండి!

ఇంటి ప‌ని చేస్తూ ఏడ్చేసిన‌ న‌టి

‘దారుణం, అత‌డి ప్ర‌తిభ‌ను కొట్టేశారు’

న‌యా ట్రెండ్ సృష్టిస్తోన్న ‘ఆహా’

సింగ‌ర్‌కు ఐదోసారీ క‌రోనా పాజిటివ్‌