సుందర నగరానికి సహకరించాలి

29 May, 2018 07:40 IST|Sakshi
స్వీపింగ్‌ మిషన్‌ ప్రారంభిస్తున్న మంత్రులు మంత్రులు లక్ష్మారెడ్డి, ఈటల రాజేందర్‌

కరీంనగర్‌కార్పొరేషన్‌ : కరీంనగర్‌ నగరపాలక సంస్థలో నూతనంగా కొనుగోలు చేసిన స్వీపింగ్‌ మిషన్‌ను సోమవారం కోర్టు చౌరస్తాలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి, రాష్ట్ర ఆర్థిక శాఖ ఈటల రాజేందర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్మార్ట్‌సిటీ హోదా దక్కించుకున్న కరీంనగర్‌ పరిశుభ్రంగా ఉండేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతుందని తెలిపారు. ఈ క్రమంలోనే నగరానికి స్వీపింగ్‌ మిషన్లు కొనుగోలు చేస్తున్నట్లు వెల్లడించారు.

స్వీపింగ్‌ మిషన్లు కొనుగోలు చేయడం ద్వారా నైట్‌ స్వీపింగ్‌ కార్మికులకు భారం తగ్గుతుందని, ప్రధాన రహదారుల్లో ప్రమాదాలను నియంత్రించొచ్చని పేర్కొన్నారు. రహదారులు పరిశుభ్రంగా ఉంటే నగరం సుందరంగా మారుతుందని, ప్రతి ఒక్కరూ సుందర నగరం కోసం సహకరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, జెడ్పీ చైర్‌పర్సన్‌ తుల ఉమ, మేయర్‌ రవీందర్‌సింగ్, డిప్యూటీ మేయర్‌ గుగ్గిళ్లపు రమేశ్, నగరపాలక సంస్థ కమిషనర్‌ శశాంక, మున్సిపల్‌ అధికారులు, కార్పొరేటర్లు పాల్గొన్నారు.

అభివృద్ధి పనులు ప్రారంభం
నగరంలోని 35వ డివిజన్‌ సప్తగిరికాలనీలో ముఖ్యమంత్రి ప్రత్యేక నిధుల నుంచి చేపట్టనున్న రూ.2.4కోట్ల అభివృద్ధి పనులకు మంత్రులు శంకుస్థాపన చేశారు. వారు మాట్లాడుతూ ప్రపంచంలోనే అత్యంత చిన్న సుందర నగరంగా కరీంనగర్‌కు గుర్తింపు ఉందని, కరీంనగర్‌ను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మేయర్‌ రవీందర్‌సింగ్, కార్పొరేటర్‌ కవితబుచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

నాపై దాడి చేసింది ఆయనే : జబర్దస్త్‌ వినోద్‌

ఎగిరే పార్టీకాదు.. నిలదొక్కుకునే పార్టీ..

‘మేఘా’ పై జీఎస్టీ దాడులు అవాస్తవం

అతి పెద్ద డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల కాలనీ

కరీంనగర్‌ మున్సిపల్‌ ఎన్నికకు బ్రేక్‌

సెల్‌ఫోన్‌ కొనివ్వలేదని..

‘హరిత’ సైనికుడు

‘జబర్దస్త్‌’ ఆర్టిస్ట్‌ వినోదినిపై దాడి.. గాయాలు

లైట్‌ జాబా.. అయితే ఓకే

‘కేఎంసీ తెలంగాణకే తలమానికం’

‘దేశంలో రూ. 2016 పెన్షన్‌ ఇస్తున్నది కేసీఆర్‌ మాత్రమే’

ఈ కాలేజ్‌లకు లెక్చరర్లే లేరు!

దౌల్తాబాద్‌లో భార్యపై హత్యాయత్నం

ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేసిన వారు కూడా నేరస్తులే 

హైదారాబాద్‌ బస్సు సర్వీసులపై అభ్యంతరం

దోపిడీ దొంగల హల్‌చల్‌! 

లక్కోరలో మహిళ దారుణ హత్య 

పురుగులమందు పిచికారీకి ఆధునిక యంత్రం

రాష్ట్రంలో కాంగ్రెస్‌ కనుమరుగు

‘బీ–ట్రాక్‌’@ గ్రేటర్‌

సీతాకోక చిలుకా.. ఎక్కడ నీ జాడ?

ఫ్లోరైడ్‌ బాధితుడి ఇంటి నిర్మాణానికి కలెక్టర్‌ హామీ

మరింత ఆసరా!

పైసా వసూల్‌

పురుగుల అన్నం తినమంటున్నారు..!

‘హరీష్‌ శిక్ష అనుభవిస్తున్నాడు’

ఆస్పత్రి గేట్లు బంద్‌.. రోడ్డుపైనే ప్రసవం..!

కిడ్నాప్‌ ముఠా అరెస్టు

సారొస్తున్నారు..

డబ్బుల కోసమే హత్య.. పట్టించిన ఫోన్‌ కాల్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘మా కొడుకు మమ్మల్ని కలిపి ఉంచుతున్నాడు’

అడవి శేష్‌ ‘ఎవరు’ రీమేకా?

రూల్స్‌ బ్రేక్‌ చేసిన రాంగోపాల్‌ వర్మ!

ఉత్తర ట్రైలర్‌ లాంచ్‌

బైక్‌ మీద సినిమాకెళ్తున్నా : ఆర్జీవీ

సెన్సార్‌ పూర్తి చేసుకున్న ‘డియర్‌ కామ్రేడ్‌’