పింఛనిప్పించండి సారూ..

30 Dec, 2014 02:52 IST|Sakshi

ప్రగతినగర్ : పింఛన్ కోసం సోమవారం ప్రజావాణిలో వినతులు వెల్లువెత్తాయి. ఉదయం నుంచి బారులుదీరి వృద్ధులు, వికలాంగులు, వితంతువులు దరఖాస్తులు చేసుకున్నారు. వివిధ సమస్యలపై 183 ఫిర్యాదులు రాగా కేవలం పింఛన్ కోసం 476 ఫిర్యాదులు అం దాయి. అదనపుజేసీ శేషాద్రి, డీఆర్‌ఓ మనోహర్, పీడీ వెంకటేశం ఫిర్యాదులు స్వీకరించారు.

ఆసరాను అందించండి...
అర్హులైన వికలాంగులందరికీ ఆసరాను అందించాలని వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యం లో జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో వికలాంగులు ధర్నకు దిగారు. ఈ సంధర్బంగా బీహెచ్‌పీఎస్ నాయకులు దుర్గాప్రసాద్ మాట్లాడుతూ అర్హులైన వికలాంగులకు ప్రభుత్వం ఆసరా కల్పించాలన్నారు.ఎంతో మంది వికలాంగులు అర్హులుగా ఉన్నా సదరం నిర్వాహకుల వల్ల వికలాంగులకు పింఛన్ అందకుం డా పోతుందన్నారు.నిజమైన వికలాంగులు పింఛన్‌రాక తిప్పలు పడుతున్నారన్నారు.

‘ఉగాదే’ కొత్త సంవత్సరం
తెలుగునామ సంవత్సర ఉగాదే మన కొత్త సంవత్సరమని హిందూ జన జాగృతి ఆధ్వర్యంలో ఏజేసీని కలి సి వినతి పత్రాన్ని సమర్పించారు.అంతకుముందు స్థానిక శివాజీనగర్‌లోని శివాజీ చౌక్ నుంచి ర్యాలీ చేపట్టారు. హిందూవులకు ఉగాదే ఉత్తమమైన పండుగని, జనవరి ఒకటి మన నూతన సంవత్సర పండుగ కాదని జాగృతి ప్రతినిధులు పేర్కొన్నారు. అందువల్న జనవరి ఒకటిన నూతన సంవత్సర వేడుకలను నిషేధించాలని డిమాండ్ చేశారు. ఉగాదిని పండుగను ప్రభుత్వం నూతన సంవత్సరంగా ప్రకటించాలన్నారు.

సర్పంచ్‌పై ఫిర్యాదు
నిజమాబాద్ మండలం మల్కాపూర్ గ్రామ సర్పంచ్, కార్యాదర్శి కలిసి ఆసరా పథకంలో మంజూరు అయి న పింఛన్ ఇవ్వకుండా ఇంటి ట్యాక్సును వసూలు చేస్తున్నారని గ్రామస్తులు అదనపు జాయింట్ కలెక్టర్ శేషాద్రికి ఫిర్యాదు చేశారు. వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
 
ట్రైసైకిళ్ల పంపిణీ
వికలాంగులకు సోమవారం ప్రజావాణిలో ఏజేసీ శేషాద్రి ట్రైసైకిళ్లను పంపిణీ చేశారు.వికలాంగులైనా రవి,సాయమ్మ, గౌస్‌లు ట్రైసైకిల్లకోసం దరఖాస్తు చేసుకోగా వారికి అందించారు. ఏజేసీ మాట్లాడుతూ వికలాంగులు ట్రైసైకిళ్లు,వినికిడి యంత్రాలు,చేతి కర్ర లు ఇతర వికలాంగులకు సంబంధించిన పరికరాల కోసం వికలాంగుల సంక్షేమ శాఖలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.  

మరిన్ని వార్తలు