బిల్లులు అందేదెన్నడో?

5 Sep, 2014 23:43 IST|Sakshi

* మరుగుదొడ్ల డబ్బుల చెల్లింపులో జాప్యం    
* ఆందోళనలో లబ్ధిదారులు
 
సాక్షి, మంచిర్యాల : బహిరంగ మల, మూత్ర విసర్జనకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్న కార్యక్రమాలు క్షేత్రస్థాయి అధికారుల వైఫల్యంతో లక్ష్యం నెరవేరడం లేదు. జిల్లాలో వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు చెల్లించాల్సిన సర్కారు సహాయం బకాయి ఉండడమే ఇందుకు నిదర్శనం. ప్రజలు మరుగుదొడ్లు నిర్మించుకోవడానికి పాలకులు కొన్ని ప్రోత్సాహకాలు ప్రకటించారు. 2012 ఆగస్టు నుంచి ఉపాధి హామీ పథకం ద్వారా మరుగుదొడ్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు ఆర్థిక సహాయం అందించే విధానాన్ని ప్రభుత్వం ప్రవేశ పెట్టింది.
 
ఉపాధి హామీ పథకం, నీటి పారుదల సరఫరా విభాగం(ఆర్‌డబ్ల్యూఎస్), లబ్ధిదారులు సంయుక్తంగా మరుగుదొడ్డి నిర్మాణ వ్యయం భరించేలా మార్గదర్శకాలు రూ పొందించారు. రూ.10,900 విలువ గల మరుగుదొడ్డి నిర్మాణంలో లబ్ధిదారుడి వాటా రూ.900, ఈజీఎస్ రూ.5,600, ఆర్‌డబ్ల్యూఎస్ రూ.4,600 సదరు అర్హుడికి చెల్లించాల్సి ఉంటుంది. లబ్ధిదారుడికి చెల్లించాల్సిన మొ త్తం ఈజీఎస్ అందజేస్తుంది. ఆర్‌డబ్ల్యూఎస్ నుంచి రావాల్సిన సొమ్ము మూడు నెలలుగా పెండింగ్‌లో ఉంటున్నా యి. దీంతో లబ్ధిదారులకు ఇబ్బందులు తప్పడం లేదు.
 
వేలాది మంది ఎదురుచూపు
జిల్లాలో పథకం ప్రారంభం నుంచి 1,83,779 మంది దరఖాస్తు చేసుకోగా, 1,80,814 మంది అర్హులను గుర్తిం చా రు. 1,77,026 మంది లబ్ధిదారులు పనులు ప్రారంభిం చాల్సిందిగా ఈజీఎస్ సూచించింది. 40,680 మరుగుదొడ్లు ప్రస్తుతం నిర్మాణంలో ఉండగా, 38,144 నిర్మా ణం పూర్తయ్యాయి. పూర్తయిన వ్యక్తిగత మరుగుదొడ్లను రూ.17.43 కోట్లు ఈజీఎస్ తరఫున లబ్ధిదారులకు చెల్లించారు. అయితే ఆర్‌డబ్ల్యూఎస్ నుంచి వి నియోగదారులకు రావాల్సిన డబ్బులు పెండింగ్‌లో ఉన్నాయి. బిల్లులు రాకపోవడంతో దండేపల్లి ఎంపీడీవో కార్యాలయం ఎదుట లబ్ధిదారులు ఆందోళన చేపట్టారు. బిల్లులు చెల్లిం చేలా అధికారులు చర్యలు తీసుకోవాలి.

మరిన్ని వార్తలు