‘దళితులకు మూడెకరాల భూమి ఏమైంది’

27 Jun, 2017 19:33 IST|Sakshi

హైదరాబాద్: వ్యవసాయాధారిత దళితులకు మూడెకరాల భూమి ఇస్తామని సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ ఏమైందని  బీజేపీ జాతీయ కమిటీ సభ్యుడు పేరాల చంద్రశేఖర్ రావు ప్రశ్నించారు. పార్టీ కార్యాలయంలో మంగళవారం ఆయన మాట్లాడుతూ ప్రచార ఆర్భాటం తప్ప ఆచరణలో భూ పంపిణీ కనిపించడంలేదని అన్నారు. కొన్ని ప్రాంతాల్లో 2 నుంచి 3 లక్షలకు ఎకరం చొప్పున కొని, 6లక్షల దాకా చెల్లించినట్లుగా తప్పుడు లెక్కలు రాశారని ఆయన ఆరోపించారు. ప్రభుత్వం నుంచి ఎక్కువ మొత్తం చెల్లించినట్టుగా చెప్పి టీఆర్ఎస్ నాయకులే కాజేశారన్నారు. ఈ పథకం అమలుపై సమగ్ర విచరణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.

 

మరిన్ని వార్తలు