‘బీసీ రిజర్వేషన్లపై శాశ్వత పరిష్కారం కావాలి’

12 Jul, 2018 04:49 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై శాశ్వత పరిష్కారం చూపాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. ఈ మేరకు బుధవారం బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆర్‌.కృష్ణయ్య, సంఘం ప్రతినిధులు గుజ్జకృష్ణ, జైపాల్, రాజ్‌ కిరణ్‌ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావును కలిశారు. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇస్తేనే అన్ని వర్గాలకు సమన్యాయం జరుగుతుందన్నారు. స్థానిక సంస్థల్లో 50శాతం రిజర్వేషన్లు దాటొద్దని హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు తెలిపిందని, ఈ సందర్భంలో సుప్రీంకోర్టు నుంచి స్టే కోసం కాకుండా శాశ్వతంగా పరిష్కరించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

పరిపూర్ణానంద బహిష్కరణ అప్రజాస్వామికం

‘ప్రత్యేక’ కసరత్తు షురూ 

నాలుగు డెయిరీలతో ‘విజయ బోర్డు’

మరో 10 క్లస్టర్లివ్వండి 

ముందు కాలుష్యరహితం.. తర్వాతే సుందరీకరణ 

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

కార్తీ చిత్రానికి ఉప రాష్ట్రపతి ప్రశంసలు

సారీ విశాల్‌ !

డేట్‌ ఫిక్స్‌?

సృష్టే సాక్ష్యంగా...

ఒక రోజు ముందే వేడుక

అమ్మపై కోపం  వచ్చింది!