రోడ్డు ప్రమాదంలో రాజస్థాన్‌ వాసి మృతి

19 Oct, 2019 12:37 IST|Sakshi
అంజుమ్‌ఖాన్‌ మృతదేహం, పక్కన ద్విచక్రవాహనం

విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొన్న బైక్‌ 

నర్సాపూర్‌పెద్దతండా, పట్లూర్‌ మధ్య ఘటన

సాక్షి, మర్పల్లి: బతుకు దెరువుకోసం వచ్చిన ఓ యువకుడు బైక్‌పై వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. ఈ సంఘటన మండల పరిధిలోని నర్సాపూర్‌ పెద్దతండా, పట్లూర్‌ గ్రామాల మధ్య శుక్రవారం సాయంత్రం చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.. రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌ జిల్లా జార్‌క్లా గ్రామానికి చెందిన అంజుమ్‌ఖాన్‌ (32) నర్సాపూర్‌ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి వద్ద మూడేళ్లుగా జేసీబీ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. ఇటీవల బక్రీద్‌ పండగ కోసం ఇంటి వెళ్లివచ్చాడు.

తిరిగి రెండు నెలల క్రితం ఇక్కడకు వచ్చాడు. శుక్రవారం సాయంత్రం నర్సాపూర్‌లో నమాజ్‌ చేసుకుని ద్విచక్ర వాహనంపై వస్తుండగా ప్రమాదానికి గురయ్యాడు. కంకర మిషన్‌ సమీపంలోని రోడ్డు పక్కన ఉన్న 11 కేవీ విద్యుత్‌ స్తంభానికి ఢీకొన్నాడు. ఈ ఘటనలో అంజుమ్‌ ఖాన్‌ తల కు మతమైన గాయాలయ్యాయి. మర్పల్లి జెడ్పీటీసీ పబ్బె మధుకర్, స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో మర్పల్లి ఏఎస్‌ఐ కె.మోహన్‌రెడ్డి ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని మర్పల్లి  ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్యతో పాటు 6గురు సంతానం ఉన్నట్లు తెలిసింది.  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘కంటి వెలుగు’లో కాకి లెక్కలు!

‘తన చెల్లి ఓడిపోయింది.. మా అక్కను గెలిపిస్తాను’

దున్నపోతుకు వినతి పత్రం.. వినూత్న నిరసన

వివాదాలకు వెళ్తే చర్యలు తప్పవు

మద్యం ‘డ్రా’ ముగిసెన్‌..

హన్మకొండలో మస్తు బస్సులు... అయినా తిరగట్లేదు

దేవుడికి రాబడి!

సెర్చ్‌ కమిటీ సైలెంట్‌.. !

మూడేళ్లు..ఏడుగురు ఎస్సైలు 

రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలో గందరగోళం

‘అప్పుడిలా చేసుంటే.. కేసీఆర్‌ సీఎం అయ్యేవాడా’

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని డిస్మిస్‌ చేయాలి

స్నేహితులు ఫోన్‌ చేసి బెదిరిస్తున్నారని ఆత్మహత్య

ప్రియురాలి ఇంట్లో ఎఫ్‌బీవో ఆత్మహత్య ?

పెట్రోల్‌ రాదు.. రీడింగ్‌ మాత్రమే వస్తుంది

ఇదే మెనూ.. పెట్టింది తిను

దొంగ డ్రైవర్‌ దొరికాడు

తెలంగాణ బంద్‌; ఆర్టీసీ క్రాస్‌ రోడ్‌లో టెన్షన్‌

తెలంగాణ బంద్‌: ప్రతి 3నిమిషాలకు మెట్రో రైలు

ముగిసిన మద్యం టెండర్ల ప్రక్రియ

కలవరమాయే మదిలో..

నేడే తెలంగాణ రాష్ట్ర బంద్‌

22న మూడు రాష్ట్రాల సీఈల భేటీ

మెట్రో రైలులో ఊడిపడిన  సీలింగ్‌!

మరో 2 వేల విద్యుత్‌ కొలువులు

టీచర్లకు టెస్ట్‌లు!

లక్కు..కిక్కు

కారుకు ఓటేస్తే  బీజేపీకి వేసినట్లే!

సాగర్‌లోకి స్కార్పియో..ఆరుగురు గల్లంతు 

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

కంటతడి పెట్టిన కమల్‌హాసన్‌

'రాజుగారి గది 3' మూవీ రివ్యూ

‘ఆపరేషన్‌ గోల్డ్‌ ఫిష్‌’ మూవీ రివ్యూ

మీటూ ఫిర్యాదులతో అవకాశాలు కట్‌

బాలీవుడ్‌ కమల్‌హాసన్‌

కొత్త సంవత్సరం.. కొత్త ఆఫీస్‌