బెయిల్‌పై వచ్చినా అదే పని..

1 Sep, 2019 11:45 IST|Sakshi

జైలు నుంచి వచ్చిన నెలరోజులకే మరో నేరం 

మహిళపై హత్యాయత్నం కేసులో నిందితుడి రిమాండ్‌

సాక్షి, మహబూబ్‌నగర్‌ క్రైం: ఓ యువకుడిని హత్య చేసి జైలుకువెళ్లాడు.. ఆ తర్వాత జైలులో 10 నెలల పాటు జైలుశిక్ష అనుభవించిన ఓ యువకుడు నెల రోజుల క్రితమే బెయిల్‌పై బయటకు వచ్చాడు.. అయితే జైలు నుంచి వచ్చిన నెలరోజుల్లోనే మరొకరిపై హత్యాయత్నానికి పాల్పడి మళ్లీ కటకటాల పాలయ్యాడు. ఈ సంఘటనకు సంబంధించి టూటౌన్‌ సీఐ శ్రీనివాసాచారి టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో వెల్లడించారు. టీడీగుట్టకు చెందిన క్రాంతికుమార్‌ వృత్తిరీత్యా ప్లంబర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. క్రాంతికుమార్‌ పాత పాలమూరుకు చెందిన రమేష్‌ ఇద్దరు స్నేహితులు. అయితే వీరు ఇద్దరికి పాత పాలమూరుకు చెందిన కృష్ణవేణి (ప్రస్తుతం హత్యాయత్నానికి) గురైన మహిళతో కొన్ని రోజుల నుంచి వివాహేతర సంబంధం కొనసాగుతుంది.

అయితే రమేష్‌ను అడ్డు తప్పిస్తే ఆమె తనతోనే ఉంటుందని భావించిన క్రాంతికుమార్‌ ఆ మహిళతో కలిసి 2018 నవంబర్‌ 30న రాత్రి టీడీగుట్ట శ్మశాన వాటికలో కత్తులతో పొడిచి రమేష్‌ను హత్య చేశారు. ఈ హత్య కేసులో వారు రిమాండ్‌కు సైతం వెళ్లారు. అప్పటి నుంచి క్రాంతికుమార్, కృష్ణవేణి మధ్య వివాహేతర కొనసాగింది. ఇటీవల జైలు నుంచి బయటకు వచ్చిన క్రాంతికుమార్‌కు కొన్నిరోజులుగా కృష్ణవేణి నడవడికపై అనుమానం వచ్చింది. దీంతో ఎలాగైన తనను హత్య చేయాలని పథకం వేసి.. ఈ నెల 28న రాత్రి టీడీగుట్టలో ఉన్న శ్మశాన వాటిక దగ్గరకు వెళ్లారు.

రాత్రి మొత్తం అక్కడే ఉండి తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో కృష్ణవేణిని తలపై బండరాయితో మోదడంతోపాటు ఆమె మెడకు చున్నీ గట్టిగా కట్టాడు. తలకు తలిగిన గాయంతో అపస్మారక స్థితిలోకి వెళ్లగా చనిపోయిందనుకుని భావించి ఇంటికి వెళ్లిపోయాడు. దీంతో ఉదయం 5 గంటల ప్రాంతంలో స్థానికులు మహిళను శ్మశాన వాటికలో అపస్మారక స్థితిలో ఉండటాన్ని గుర్తించి పోలీసులకు ఇచ్చిన సమాచారంతో చికిత్స కోసం జనరల్‌ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతుంది. బాధితురాలిని పోలీసులు విచారించగా క్రాంతికుమార్‌ తనను చంపడానికి ప్రయత్నించాడని చెప్పడంతో అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు. అయితే రమేష్‌ను హత్య చేసిన ప్రాంతంలోనే కృష్ణవేణిపై హత్యాయత్నం చేయడం విశేషం. 
   
 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా