నగదు విత్‌డ్రా కోసం వచ్చి, ఏకంగా ఏటీఎంనే..

24 May, 2018 11:54 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, హైదరాబాద్‌ : నగరంలోని సోమాజీగూడ సౌత్‌ ఇండియన్‌ బ్యాంక్‌ ఏటీఎంలో విచిత్ర సంఘటన జరిగింది. నగదు విత్‌డ్రా కోసం వచ్చిన వ్యక్తి ఎవరూ లేరు అనుకొని ఏకంగా ఏటీఎం చోరీ చేయడానికి యత్నించాడు. అయితే సెక్యూరిటీ అలారం మోగడంతో దుండగుడు వెనక్కి తగ్గాడు. నగదు డ్రా చేసుకొని వెళ్లిపోయాడు. ఈ దృష్యాలన్నీ సీసీ కెమరాలో నమోదయ్యాయి. బ్యాంకు అధికారుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలింపు చేపట్టారు.

మరిన్ని వార్తలు